Friday, November 28, 2008

ఇదే చివరి టపా


ఏప్రిల్ నెలలో ఒక్కటపాతో మొదలై మధ్యలో నాలుగు నెలల సుదీర్గ విరామం తో ఆగస్టు నెలలో రెండు,సెప్టెంబరులో ఒకటి అక్టోబర్ లొఇరవై ఒకటి,నవంబరులొ మొత్తం ముప్పైఏడు టపాలతో వెలువడ్డ ఈ బ్లాగుకు ఇదే చివరి టపా.మొత్తం మూడు వేలమంది సందర్శకులు వీక్షించారు,కామెంట్లు మాత్రం పది లోపే.
శెలవు

Happy First Anniversary





Happy First Anniversary to NavatarangaM

http://navatarangam.com/2008/11/help-navatarangam/

Monday, November 24, 2008

యువరాజ్ సినిమా సమీక్ష


యువరాజు..ఒకరోజు

అమాయికత్వంలోంచే క్రియేటివిటీ పుడుతుంది. అన్నీ తెలిస్తే ఏమీ సృజించలేము అని చాలా సార్లు విన్నాను. చెప్పేది క్రియేటివిటి చచ్చిపోయిన వాళ్ళే కాబట్టి నమ్మాలా…వద్దా అనే డైలమా ఉంటూండేది. అయితే ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ సృజించిన యువరాజ్ చూసిన తర్వాత వారు చెప్పేది కరెక్టే అని ఋజువైపోయింది. అందులోనూ విజిలింగ్ వుడ్స్ అనే ఇనిస్టిట్యూట్ పెట్టిన నాటి నుండి ఆయనలో ఏదో చెప్పాలన్న టీచింగ్ తాపత్రయం మరీ ఎక్కువ అవుతున్నట్లుంది. దాంతో కలసి వుంటే కలదు సుఖం,దురాశే అన్ని బాధలకు మూలం వంటి సిద్దాంతాలు మూట కట్టుకుని యువరాజు అంటూ ధియేటర్స్ లోకి దూకాడు. ఫలితం ప్రేక్షకులకు ప్రత్యక్ష్య నరకం.దాంతో యువరాజు-ఒకరోజు మాత్రమే ధియోటర్స్ ని ఏలగల్గాడు.
రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

http://navatarangam.com/2008/11/yuvvraaj-review/

వి(న్)నాయకుడు(రివ్యూ)



ఈ సినిమాను మన రెగ్యులర్ డైరక్టర్స్ చేసుంటే గ్యారింటీగా ఏ ‘బండోడి ప్రేమ’ అనే టైటిల్ పెట్టి అంతే మోటుగా సినిమా చుట్టేసేవారు. అంతేగాక ఒబిసిటిపై రకరకాల డైలాగులు,ఘోరంగా జోకులు వేసి చివరలో “అలా అనకూడదు..వాళ్ళు మనలాంటి వారే..గుర్తించండి” అని అధ్బుతమైన మెసేజ్ చెప్పేసి ఎంత గొప్ప పని చేసేమో అన్నట్లు మనవంక చూసేవారు. ఈ కొత్త డైరక్టర్ అలా పాత రూటులోకి వెళ్ళి అతి చేయ్యకపోవటమే ఈ సినిమా గొప్పతనం . నేరేషన్ స్లోగా ఉందనిపించినా,

రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

http://navatarangam.com/2008/11/vinayakudu-review/

Sunday, November 23, 2008

త్యాగయ్య గీతామృతం - నాగయ్య నటనాద్భుతం


పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము. నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక,

రచయిత: గీతాచార్య
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/tyagayya-a-classic/

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)


ఏదైనా చుట్టడమే కదా

అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని వాళ్ళు చాలా సార్లు విని ఉండటంతో సర్లే అనుకుని మద్రాస్ బయిలుదేరారు.

ఎ గ్రేట్ గైడ్

అప్పుడు మధ్యలో ఒక వ్యక్తి తగిలి నేనూ మీ వాడ్నై…మనూరూడ్నే,అంతేకాదు సినిమా వాడ్ని అన్నాడు. సర్లే ఏంటి అనుమానంగా అన్నారు. మీ వాలకం చూస్తూంటే ఎక్కడో మోసపోయేటట్లు ఉన్నారు.

రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/copy-cats/

బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం


మొదటి భాగం ఇక్కడ చదవండి.

బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు.

రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి తీసినట్టుగా వ్రాయడం ద్వారా ఆర్ట్ సినిమాలని వెక్కిరించారని ప్రసాద్ గారు వెల్లడించారు. కొండల్రావు గారు కామెడీకి రాస్తే రాసుండొచ్చు గానీ అవార్డు సినిమాలంటే ఇలానే ఉంటాయని మనవాళ్ళలో బాగా బలంగా నాటుకుపోయింది.ఆ మధ్యలో ఒక ప్రముఖ చిత్ర దర్శకుణ్ణి హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ లో జరిగిన ఒక చిత్రోత్సవం ఓపెనింగ్ కి ఆహ్వానించారు.
రచన :అన్వేషి

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/art-films-award-films-2/

Friday, November 21, 2008

బ్లాక్ &వైట్ సినిమా గురించి


ఇది కాస్త లో ప్రొఫైల్గా వచ్చి వెళ్ళిన తెలుగు సినిమా అనుకుంటా. టీవీలో యాడ్స్ చూసి సినిమా ఏదో ఆసక్తికరంగా ఉండేలాగుందే అనుకున్నాను. అయితే, ఇంకా రిలీజ్ కాలేదేమో అనుకున్నాను. ఆగస్టులోనే రిలీజైందని తెలుగుసినిమా.కామ్ సైటులో ఈ సినిమా గురించి రాసిన వ్యాసంతో అర్థమైంది. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

కథ: భరత్ (రాజీవ్ కనకాల) ఓ సాఫ్ట్‍వేర్ ఇంజినీరు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లాండ్‍మైన్ అటాక్ నుండి కొంతమంది పోలీసులను కాపాడి రాష్ట్రపతి ఇచ్చే సిటిజెన్ అవార్డుకి ఎన్నికౌతాడు. అతను అనాథగా పెరిగి స్వశక్తితో పైకొచ్చినవాడు. అతని ప్రాణస్నేహితుడు శీను, ఆఫీసు, ఇంటి దగ్గరుండే పిల్లలు - ఇదే అతని ప్రపంచం. ఇక్కడ మొదలౌతుంది మన కథ. తర్వాత ఓ అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. ఈ సమయంలోనే అతనిపై ఎవరో దాడులు చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ అతను తప్పించుకుంటూ ఉంటాడు. ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు.
రచన:సౌమ్య
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/black-white-2008/

కోకిల సినిమా


అర్థరాత్రి అంతర్గతంగా ఉన్న ఏ కోరిక వల్లో ఈ సినిమా చూశాను. చిన్నప్పుడు ఈ సినిమా అంటే ఇష్టంగా ఉండేదన్న విషయం ఐతే గుర్తు ఉంది కానీ, డిటైల్స్ గుర్తు లేవు - కథ విషయం తప్ప. ఈరోజు ఆ సినిమా చూశాక నా పాత అభిప్రాయం ఎంత మారిపోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ టపా.

కథ విషయానికొస్తే, కోకిల ఓ టీవీ గాయని. సిద్ధార్థ ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తరువాత ఓ ప్రమాదంలో సిద్ధార్థ కళ్ళు పోతాయి. అతనికి ఆరోజే హత్య వల్ల మరణించిన రిషీకేశ స్వామీజీ కళ్ళని అమరుస్తారు. కానీ, అప్పట్నుంచి సిద్ధార్థ కళ్ళు తెరిచినప్పుడల్లా అతనికి ఎవరో తనని హత్య చేయడానికి ప్రయత్నించే దృశ్యం కనబడుతూ ఉంటుంది. అవి ఆ స్వామీజీ కళ్ళు కనుక, ఇతని ద్వారా హంతకుణ్ణి పట్టుకోవచ్చు అన్నది పోలీసుల ఆలోచన. కానీ, కళ్ళు తెరిచిన ప్రతిసారీ సిద్ధార్థ అలజడికి గురవడం చూసి....
రచన:సౌమ్య

మిగిలిన భాగం ఇక్కడ చదవండి



http://navatarangam.com/2008/11/kokila-1989/

Thursday, November 20, 2008

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్


సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ల గురించి కొంత చెప్పాలి. వీధి నాటకాలకి ఆదరణ తగ్గి, పల్లెల్లో ఉత్సవాలకి 16mm తెరపై సినిమాలు ప్రదర్శించే పధ్ధతి ప్రారంభం కాడానికి ముందు, అంటే డెబ్బై, ఎనభై దశకాలలో ఈ ట్రూప్ లు పల్లె ప్రజలకు వినోదాన్ని అందించాయి. ప్రారంభంలో వీరి నృత్యాలు అశ్లీలానికి దూరంగా ఉన్నా, ట్రూప్ ల మధ్య పెరిగిన పోటీ కారణంగా తరువాతి కాలంలో అసభ్య ప్రదర్శనలు మొదలయ్యాయి. వంశీ ‘మా పసలపూడి కథలు’ లో ‘పాముల నాగేశ్వర రావు’ ‘కుమారి మా ఊరొచ్చింది’ కథల్లో ఈ ట్రూప్ ల ఒకనాటి వైభవాన్ని తెలుసుకోవచ్చు. (అంబాసిడర్ కార్లలో వచ్చే ట్రూప్ సభ్యులకు సిని తారలకు ఉన్నంత ఆదరణా ఉండేది.) ఈ ట్రూప్ లు ఉచ్ఛదశలో ఉన్నకాలంనాటి కథ ఇది.

రచన;మురళి
మిగిలిన భాగం ఇక్కడ
http://navatarangam.com/2008/11/kanakamahalakshmi-recording-dance-troup/

కొత్తపాళీ సైకిలు దొంగలు


ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు.

ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
రచన:కొత్తపాళీ
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/the-bicycle-thief-italian-1948/

Wednesday, November 19, 2008

మనసు ముంగిట్లో వెలిగిన ప్రేమ దీపం-’చిత్ చోర్’


అతడు కళ్ళూ, మనసూ చెదిరే అందగాడు కాదు. ఆరడుగుల ఆజానుబాహుడూ కాదు. ఆరుపెట్టెల దేహముదురూ కాదు! ఆమె తళుకుబెళుకుల మెరుపు తీగా కాదు. అందం కుప్ప బోసిన సౌందర్య రాశీ కాదు. అతడు మృదుస్వభావి, సంగీత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు! ఆమె పల్లెటూరి ముగ్ధ! అయినా సిగ్గుపడి తలుపు చాటుకి తప్పుకునే సిగ్గరి కాదు. అతడు మన పక్కింటబ్బాయి! ఆమె మన ఎదురింటమ్మాయి.

వారిద్దరి నిర్మలమైన ప్రేమ కథే “చిత్ చోర్ ”


రచన:సుజాత (మనసులో మాట)
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/chit-chor/

ప్రముఖ నటుడు నంబియార్ మృతి


ప్రముఖ తమిళ నటుడు మంజరీ నారాయణన్ నంబియార్(ఎమ్.ఎన్.నంబియార్)(89) ఈ రోజు మధ్యాహ్నం(బుధవారం) చెన్నై లోని ఆయన స్వగృహంలో మరణించారు.గత కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఈయన కొద్ది రోజుల క్రిందటే ఆసుపత్రి నుండి డిస్ఛార్చ్ అయ్యారు. నంబియార్ మార్చి ఏడు,1919 లో కేరళలోని కన్నూరులో జన్మించారు.ఆయన మొదటి సినిమా భక్త రామ్ దాస్(1935) హిందీ,తమిళ్ లో చేసారు. తమిళ సినిమాకు మొదటి విలన్ గా ఆయనను చెపుతూంటారు. ఆయన తెరమీదకు రాగానే అప్పట్లో టప్పుట్లు పడేవంటారు.స్టేజి ఆర్టిస్టుగా ప్రూవ్ అయి సినిమాల్లోకి రావటంతో పెద్ద పెద్ద నటులు సైతం ఆయన సలహాలు కోరేవారని చెప్పుకుంటూంటారు. ఎమ్.జి.ఆర్ ఫార్ములా సినిమాలు ఈయన విలన్ గా లేకపోతే...

రచన:జోస్యుల సూర్యప్రకాశ్

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/mn-nambira-passed-away/

Tuesday, November 18, 2008

శుభలేఖ


విశ్వనాథ్ సినిమాల్లో నాకు విపరీతంగా నచ్చిన సినిమాల్లో శుభలేఖ మొదటి ఐదింటిలో ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లే చూసాను కానీ, ఈ మధ్యే మళ్ళీ చూసాను. చూసాక, ఈసారైనా దీని గురించి నా అభిప్రాయాలు రాయాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చేసేరోజుల్లో మా కాలేజీ విద్యార్థుల్లో రచనాసక్తి ఉన్నవారికి ఓ వెబ్సైటు ఉండేది. అందులో దీని గురించి ఇంగ్లీషులో రాసానోసారి. కానీ, ఇప్పుడాసైటూ లేదు, ఆ వ్యాసం ఏమైందో అంతకంటే తెలీదు.

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

రచన:సౌమ్య

http://navatarangam.com/2008/11/subhalekha-1982/

దోస్తానా




ఏం..ఎప్పుడూ మూస కథలేనా కాస్త అప్పుడప్పుడూ సరదాకైనా ప్రయోగాలు చెయ్యచ్చుకదా…అని మనం విసుక్కోవటం బబుల్ గమ్ సినిమాలు తీస్తాడని పేరు పడ్డ కరణ్ జోహార్ చెవిన పడ్డట్టుంది. పాపం వాళ్ళన్నది కరెక్టే కదా అనుకుని వెంటనే రంగంలోకి దూకి దోస్తానా తయారు చేసి వదిలాడు. వెరైటీ అంటూ అంతలా తయారు చేసిన సినిమా స్పెషల్ ఏంటంటారా అదే…మనం ఊహించటానికి కూడా కాస్త సంశయించే గే కామిడి. అయితే ఈ సినిమా గ్యారంటీగా హాలీవుడ్ ఫ్రీమేక్ అయ్యుంటందని ఫిక్సవ్వద్దు..అది మన వాళ్ళ బుర్రల్లోంచి హండ్రడ్ పర్శంట్ పుట్టిందే. ఇలాంటి సినిమా ఇండియన్ జనాలికి నచ్చిందా అంటే పిచ్చపిచ్చగా నచ్చిందని భారీ కలెక్షన్స్ చెపుతున్నాయి.ఇలా అంతా ఆశ్చర్యపోతారనే…కథ నేపధ్యాన్ని తెలివిగా మియామి లో తీసుకున్నాడు. ఫారిన్ కంట్రి కాబట్టి అక్కడ ఇలాంటివి మామూలే అని మనకు అనిపించాలనే ఆయన ఉద్దేశం కావచ్చు.


http://navatarangam.com/2008/11/dostana-review/

జానతెలుగుపాటల పుంస్కోకిల - ఒక స్మృత్యాంజలి





తను తెలుగు వాడిగా — వాడిగా తెలుగు వ్రాయగల వాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే.

నేను తెలుగు వాడినై — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాడినై — పుట్టడం నా అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచన చదివితే.

పానగల్ పార్కులోని పేరులేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వవిద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావసరస్వతి — ఆయన.

రూపాయ చేసే సెకెండు హ్యాండు పుస్తకాన్ని “విలువ” తెలిసి రెండున్నర పెట్టి కొనుకున్న జోహారి — మేలిమి వజ్రాల బేహారి —ఆయన.

తన రచనలు వేరొకరి పేరుతో చెలామణీ అయినా తనకు అందాల్సిన శ్రీ యశః కీర్తులు వేరొకరి పరమయినా చిరునవ్వే సమాధానంగా కూర్చున్న గుప్తదానపథ సంచారవర్తి — సాక్షాత్ శిబి చక్రవర్తి — ఆయన.


http://navatarangam.com/2008/11/malladi/

Sunday, November 16, 2008

మన సినిమాలెందుకు మూస దాటవు?


తెలుగు సినిమాలేకాదు, భారతీయ సినిమాలు చూసేవారెవరినయినా వేధిస్తూన్న ప్రశ్న ఇది?

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే మన దేశం సినిమాలు నాణ్యత విషయంలోకానీ, సాంకేతికామ్షాలలో కానీ, కథామ్షాలలో కానీ ఇతర చిన్న చిన్న దేశాల సినిమాలతో పోలిస్తే తేలి పోతాయి.

మన దగ్గర మెగా స్టార్లున్నారు. సూపర్ స్టార్లున్నారు. పవర్ స్టార్లున్నారు. కానీ చెప్పుకోటానికి ఒక్క మంచి అంతర్జాతీయ స్థాయి సినిమా లేదు. ఎంత సేపూ, మల్లీశ్వరి, మాయా బజార్, మూగ మనసులు లాంటి కొన్ని సినిమాల పేర్లు తప్పించి వెంట వెంటనే ఒక పది సినిమాల పేర్లు గుర్తుకు రావు.

హాంగ్ కాంగ్ లో నిర్మించిన ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచ సినిమాల్లో పోరాట స్వరూపాలను మార్చేసింది. గాడ్ ఫాదర్ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్రెంచ్ సినిమాలు, ఇటలీ దేశ సినిమాలు, ఇరాన్ సినిమాలు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. కానీ మనము మాత్రం అత్యధిక సినిమాలు చూస్తూ, అత్యధిక కాలం సినిమాలు చూస్తూ గడుపుతూ, ఇతరులకు జేజేలు పలుకుతున్నాం తప్ప మనమేమి చేస్తున్నాం, ఎందుకని అంతర్జాతీయ ప్రామాణికాలకు మనం తూగటంలేదు అని ఆలోచించటం లేదు.

రచన:కస్తూరి మురళీ కృష్ణ

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/formula-films/

Saturday, November 15, 2008

తారే జమీన్ పర్ కు అస్కార్ వచ్చే అస్కారం ఎందుకు లేదంటే….


ఈ సంవత్సరం జూన్ లో ఆస్కార్ అకాడెమీ ప్రపంచంలోని 95 దేశాలనుంచి ’Best Foreign Language Film’ విభాగం లో అవార్డు ఇచ్చేందుకు గానూ నామినేషన్స్ కోరుతూ చేసిన ప్రకటనకు 67 దేశాలు స్పందించి తమ తమ నామినేషన్స్ పంపించాయి.మన దేశం నుంచి ఈ నామినేషన్స్ కు ’తారే జమీన్ పర్’ ని పంపించారు.

ఈ 67 సినిమాలతో పోటీపడి ’తారే జమీన్ పర్’ చివరి ఐదు సినిమాల లిస్టులో నిలవగలదా అంటే అనుమానమే. అందుకు కారణం దాన్ని మించిన ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ ఉన్నాయి.

రచయిత: అన్వేషి

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/tzp-oscar/

ఆవకాయ బిర్యాని-సమీక్ష


టైటిల్ వినగానే…ఏదో ఫీలింగ్ ..అందులో శేఖర్ కమ్ముల బ్యానర్ నుండి వస్తున్న సినిమా అనగానే మరికొంత ఎట్రాక్షన్..ఊ…చూసేద్దాం అని థియేటర్ లోకి దూకితే అర్దమైంది నేనెంత తప్పుచేసానో. పరిష్కారం చూపని ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ గా చెప్పాడా అంటే…మధ్యలో తెలంగాణ ఊరి సమస్యలు అంటూ ప్రభుత్వ ప్రకటనలా టార్చర్ స్టార్ట్ చేసాడు. ఇదీ ధియోటర్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్.

మహ్మద్ అక్బర్ కలామ్(కమల్ కామరాజు) దేవరకొండ అనే తెలంగాణ పల్లెలో సెవన్ సీటర్ ఆటో నడుపుతూంటాడు. లక్ష్మి(బిందు మాధవి) ఆవకాయ అమ్ముకుని కుటుంబానికి సహకరించాలనుకుని పోలవరం (ఆంధ్రా)నుంచి వలస వచ్చిన అమ్మాయి. లక్ష్మి వికారబాద్ కి వెళ్ళటానికి అక్బర్ ఆటో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మీరూహించినట్లే


రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/avakaya-biryani-review/

Friday, November 14, 2008

‘రొమాంటిక్ కామెడీలు’-వాటి రూటే వేరు!!


“ఇరవై సంవత్సరాల లోపులో ప్రేమలో పడనివాళ్ళూ, అరవై సంవత్సరాలు దాటాక ప్రేమలో పడేవాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలంటారు..ఎందుకంటే వారు ఏదో మానసిక లోపంతో కాలం గడుపుతున్నట్లు లెక్క!” అని పెద్దలు చెప్తూంటారు.ఆవకాయి బిర్యాని రిలీజ్ అయ్యింది. త్వరలో ‘వినాయుకుడు’ తన ప్రేమ కథతో ధియోటర్స్ లోకి దూకనున్నాడు. అలా శేఖర్ కమ్ముల ఆనంద్ పుణ్యమా అని మళ్ళి రొమాంటిక్ కామిడీల వైపుకు తెలుగు పరిశ్రమ మెల్లి మెల్లిగా మళ్ళుతోంది.ఈ స్దితిలో…రొమాంటిక్ కామిడీ అనే జనరంజక జాతము (Popular Genre) పై సరదాగా ఓ సైటేస్తే…

భావనాత్మక అనుబంధాలు(రొమాంటిక్ రిలేషన్షిప్స్ కి వచ్చిన తంటా) కేంద్ర బిందువుగా ఉన్న హాస్య చిత్రాలే రొమాంటిక్ కామెడీలు. ఇవి ఎలా మొదలయ్యి జనరంజకం అయ్యాయీ అంటే…ప్రపంచ సినిమా ప్రారంభంలో వచ్చిన మూకీ చిత్రాలన్నీ ఎక్కువ శాతం కామిడి బిట్స్ గా ఉండేవి. కొత్తలో ఎగబడి చూసిన జనం తర్వాత కొంతకాలానికి అవి పాతబడిపోయిన భావం కలిగి బోర్ కొట్టసాగాయి. అప్పుడు మార్పు రావాల్సిన అవసరం ఉందని స్టూడియో అధినేతలు బుర్రల్లో సెర్చిలైట్స్ వేసుకుని వెతికారు.

ఇంతలోకి సినిమా మెల్లిగా బాల్యావస్దను వీడి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న గుర్తుగా మాటలు నేర్వడం,


రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్
మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/romantic-comedies/