Thursday, October 23, 2008

ప్లీజ్ ప్లీజ్ పులి మామా!







సత్యజిత్ రాయ్ రాసిన ఏడు వ్యాసాల సంకలనం - మేకింగ్ మూవీస్ లో ఇది ఏడవ, చివరి వ్యాసం. ఆరో వ్యాసం ఇక్కడ చదవొచ్చు. ఇక్కడితో ఈ వ్యాస పరంపర సమాప్తం. మొత్తం అన్ని వ్యాసాలనూ డిసెండింగ్ ఆర్డర్ లో ఇక్కడ చదవొచ్చు.
Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

Goopy Gyne Bagha Byne సినిమా వచ్చిన చాలారోజులకి నేను దానికి కొనసాగింపుగా “హిరాక్ రాజ్య దేశే” (వజ్రాల రాజ్యం) అన్న సినిమా తీద్దామనుకున్నాను. గూపూ,బాఘా ఇద్దరూ ఈ సినిమాలో కౄరుడు, నిరంకుశుడు అయిన వజ్రాలరాజు రాజ్యంలోకి అడుగుపెట్టాక వాళ్ళ వీరగాథల గురించిన సినిమా ఇది. వజ్రాలరాజు ఖజానాలో ఓ పెద్ద పెట్టె నిండా వజ్రాలు ఉన్నాయి. గూపీ, బాఘా రాజభటులకు లంచం ఇవ్వడానికి వాటిలోంచి కొన్ని దొంగిలించాలి. కౄరుడైన రాజుని పదవీచ్యుతుణ్ణి చేయడం ఈ భటుల్ని కొనగలిగితేనే సాధ్యం. స్థానిక గురువు ఉదయన్ పండిట్ ఆలోచన ఇది. వజ్రాల రాజు నిరంకుశత్వానికి చరమగీతం పాడడానికి గూపూ, బాఘాలు ఇతనితో చేయి కలిపారు. వీళ్ళిద్దరూ ఖజానా చేరుకుంటారు. తలుపు వద్ద అటూ ఇటూ తిరుగుతున్న కాపలా భటుడు ఒకడు ఉంటాడు. కానీ, దయ్యాలరాజు ద్వారా గూపీ కి ఒక వరం దక్కి ఉంటుంది. అతను పాడుతూ ఉంటే ఎవరూ ఓ అంగుళం కూడా కదలలేరు, ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కనుక, అతను పాట పాడుతూ ఉంటే, బాఘా తేలిగ్గా కాపలావాడి చేతులు తాళ్ళతో కట్టేసి, నోరు మూసేసి అతని దగ్గర్నుండి తాళం తీసుకుంటాడు. తరువాత వాళ్ళు ఆనందంగా ఆ పెద్ద ద్వారాన్ని, దానికున్న పెద్ద తాళాన్నీ తీసి, ఇక ఏ అడ్డంకులూ లేవూ అనుకుంటూ లోపలికి అడుగుపెడతారు. అక్కడ ఆ పెట్టెకున్న తాళాలు విప్పే తాళం చెవిని ఓ పులు కాపలా కాస్తూ ఉందని వాళ్లెలా ఊహించగలరు? గూపీ పాడగలిగితే పులి కూడా స్థాణువౌతుంది కానీ, భయంతో గొంతెండిపోయిన గూపీ ఎలా పాడగలడు?

అతను ఎంతో కష్టపడి చివరికి -
రచన- సౌమ్య

మిగిలిన భాగం ఇక్కడ చదవండి


http://navatarangam.com/2008/10/making-moviesessay-7/

Tuesday, October 21, 2008

మాన్ సూన్ వెడ్డింగ్ చూద్దామా


బిగ్ ఫేట్ పంజాబ్బీ వెడ్డింగ్ నేపధ్యంలో న్యూ ఢిల్లీ లో తీసిన సినిమా.. మీరా నాయర్ దర్శకురాలు ! వెడ్డింగ్ అన్న మాట పేరులో చూసి, ఇదేదో డాన్సూ, పాటలూ, సరదా, సంబరం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే నింపకుండా, మంచి కధ లా తీసిన, చెక్కగా, సున్నితంగా సాగిపోయే సినిమా ఈ మోన్సూన్ వెడ్డింగ్ !

సాధారణంగా పెళ్ళిళ్ళను ఎంతో రొమాంటింక్ గా.. ఎంతో సంతోషంతో - అందరు పాత్రలూ, పాత్రధారులూ సంబరంగా జరుపుకునే ఈవెంట్ లాగా తీస్తారు సినిమాల్లో. అదే సందర్భంగా పెళ్ళింట్లో, పట్టుచీరల రెపరెపలు, ఫెళ్ళుమని ఖర్చయిపోయే రూపాయలూ, పందిళ్ళూ, బాజాలూ, బాజంత్రీలూ, పెట్టుపోతలూ, కృత్రిమమో, నిజమో గానీ బోల్డన్ని ఆప్యాయతలూ, అనురాగాలూ ఆర్భాటంగా ప్రదర్శితమయ్యే సందర్భం - పెళ్ళి. మోన్సూన్ వెడ్డింగ్ - అడావుడిగా ముప్ఫయి రోజుల్లోనే షూట్ చేసిన పకడ్బందీ సినిమా. మీరానాయర్ లాంటి దర్శకురాలూ, థియేటర్ నుంచీ వచ్చిన మెఱికల్లాంటి నటీనటులూ, మరీ ఆర్టు మూవీలాగా కాకుండా, భలే సరదాగా - గమ్మత్తయిన కధనం తో, జీవితపు అన్ని పార్శ్వాలనూ స్పృసిస్తూ తీసిన ఈ సినిమా ఒక తప్పకుండా చూసి తీరాల్సిన ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమా.



సినిమా.. ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేపధ్యంలో మొదలవుతుంది. తంబూ వాలా (పెళ్ళి పందిరి వేసే వాడు / కాంట్రాక్టరు), పనిమనిషీ కూడా మన ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు! ఈ పాత్రలకి సినిమా ప్రధాన ప్లాట్ తో ఏ సంబంధం లేకపోయినా, మన జీవితాల్లో ఇతరుల జీవితాల కలబోత స్పష్టంగా, క్యూట్ గా చూపిస్తారు దర్శకురాలు. ఒక పారదర్శకత తో - కొత్త భారతీయ జీవితాన్ని చూడండి - ఆధునికత, ప్రాచీనత, విలువలూ, నాగరికతా, ఇవన్నీ, కలగలిసిపోయి, ఫేషనబుల్ యువత, సెక్స్ - దోపిడీ - ఇలా అన్నీ కలగైసిపోయి, నేటి మన జీవితాన్ని మన ముందు అందమయిన ప్లేటర్ లో చెక్కగా పేర్చి కొందరి కధల్ని కలగలిపి (ప్రతీ పాత్ర కీ ఒక కధ ఉంటుంది, ప్రతి ఫ్రేం చూడతగినది) అందంగా వొడ్డించిన వంటకం ఈ మోన్సూన్ వెడ్డింగ్.


http://navatarangam.com/2008/10/monsoon-wedding/

Monday, October 20, 2008

ద్రోణ గురించిన టాక్...............


ద్రోణ గురించిన టాక్ సినిమా వచ్చాక కంటే వచ్చే ముందే ఎక్కువ ఉండింది అనిపిస్తోంది ఇప్పుడు. నిన్ననే ఈ సినిమా చూశాను. చిన్నపాటి పరిచయ వ్యాసం ఇది.సినిమా కథ విషయానికొస్తే, ఇదో సూపర్ హీరో కథ. ఆది అనబడు హీరో అభిషేక్ బచ్చన్ ఒక కుటుంబం పెంపకంలో పెరిగి పెద్దవాడౌతాడు. ఆ కుటుంబం మరి అతన్ని ఎందుకు పెంచుతోందో అర్థం కాలేదు కానీ, హ్యారీపాటర్ లాగా ఇందులో కూడా ఆ కుటుంబసభ్యులకి అతనంటే పడదు. అతనికి చిన్నప్పట్నుంచి ఏవో కలలు వస్తూ ఉంటాయి. వాటి మూలం అతనికి అంతు పట్టదు. పెద్దవాడయ్యాక ఒకసారి రిజ్ రిజాదా అన్న మాంత్రికుడి ప్రదర్శనకి వెళతాడు. అక్కడే మాంత్రికుడికి తనకి అమృతం తెచ్చిపెట్టగల....
మిగతా భాగం ఇక్కడ చదవండి...

http://navatarangam.com/2008/10/drona-2008/

Sunday, October 19, 2008

Raiders of the Lost Ark-ఒక సమీక్ష


అతనికి James Bond లాగా గాడ్జెట్స్ లేవు, వున్నదల్లా ఒక కొరడా ఒక చిన్న తుపాకి. తల పై ఒక తోపి, మాసిన గడ్డం, అంతకన్నా మాసిన దుస్తులు. అయనకి పాములు అంటే చాలా భయం, ఎప్పుడు చూసినా ఏదో ఒక చిక్కు లో పడుతూ వుంటాడు.నేను ఎవరు గురించి చెప్తునానో మీకు అర్తం అయ్యుంటుంది ఈ పాటికి. 1981 లో అపర బ్రహ్మ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్సకత్వం లో విడుదులై సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన Raiders of the Lost Ark లో Indiana Jones పాత్ర. ఈ పాత్ర మీద మొత్తం 4 సినిమాలు వచ్చాయి,Raiders of the Lost Ark, Indiana Jones and Temple of Doom(1985), Indiana Jones and the Last Crusade(1989) ,ఈ సంవత్సరం విడుదులైన Indiana Jones and Kingdom of Crystal Skulls.


మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/10/raider-of-the-lost-ark/

Saturday, October 18, 2008

బాపు మా సినిమాలు: ఆరవ భాగం






’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే సముద్ర కెరటాలు ఊగుతున్నట్టుగా కనబడ్డాయి. ఇప్పటికీ మర్చిపోలేను. భక్తురాలిగా నటించిన శారదగారు తెల్లగౌనుతో సెట్ లోకి వస్తుంటే ఆకాశం నుంచి angel దిగివచ్చినంతగా వెలుగు నిండిపోయేది!

నిర్మాత అశక్తత కారణంగా టైటిల్స్ - నా వద్దనున్న old Christian Biblical paintings మీద superimpose చేయించి ’star wars’ theme music యధాతధంగా దింపేశాను. మన దేశంలో కాపీరైట్ కన్నా ’రైట్ టు కాపీ’ వుంది కనుక.

ఇక్కడ చదవండి http://navatarangam.com/2008/10/our-films-bapu-6/

Friday, October 17, 2008

నవతరంగం రచనలకు ఆహ్వానం







తెలుగు సినిమా ప్రపంచస్థాయి ఖ్యాతిదక్కించుకోవాలంటే మన మాతృ భాషలో మంచి సినిమాలు
వెలువడటంతోపాటు పలు భాషలలో వస్తున్న నవీన పద్ధతులను కూడా ఆకళింపు చేసుకోవలసిన ఆవశ్యకత వుంది. తెలుగు సినిమా సమీక్షలే కాకుండా భారతదేశంలోని వివిధ భాషల సినిమాల
సమీక్షలు, విశ్లేషణా వ్యాసాలు ఈ సైటులో ప్రముఖంగా కనిపిస్తాయి. ఒక్క
భారతదేశపు సినిమాలే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాలనూ పరిచయం
చేసే ఒకే ఒక్క తెలుగు సైటు మా నవతరగం http://navatarangam.com/
సినిమా సమీక్షలు, పరిచయాలే కాకుండ ప్రతీనెలా ఒక్కొక్క ప్రముఖ దర్శకుణ్ణి
పరిచయం చేస్తూ 'ఫోకస్' అనే శీర్షిక నడుపుతున్నాం. ఈ శీర్షికన ఇప్పటివరకూ
బి.యన్.రెడ్డి, ఎల్వీ ప్రసాద్, రిత్విక్ ఘటక్, జాన్ అబ్రహం, అకిరా
కురొసావా, కెంజి మిజొగుచి, బాపు, తపన్ సిన్హా, సత్యజిత్ రే, బెల టర్
లాంటి దర్శకుల సినిమా సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు
ప్రచురింపబడ్డాయి.ఈక్రమంలో తాజాగా ‘లక్షహిట్ల’ మైలురాయిని కేవలంపదినెలల కాలంలో విజయవంతంగా అధిగమించింది.ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్యనే ప్రపంచ సినీ ఉద్యమాలు అనే శీర్షిక మొదలుపెట్టి చలనచిత్ర పరిశ్రమ గతిమార్చిన సినీ ఉద్యమాలను, ఆ ఉద్యమ
ఫలితాలైన సినిమాలనూ పరిచయం చేయడం మొదలుపెట్టి జర్మన్ భావవ్యక్తీకరణ వాదం
గురించి ప్రస్తుతం వ్యాసాలు ప్రచురిస్తున్నాము.
వీటితో పాటు ఎప్పటికప్పుడు ఫిల్మ్ మేకింగ్ లోని మెలుకవలు తెలిపే
వ్యాసాలు, ప్రపంచ చలన చిత్రోత్సవాల గురించి రిపోర్టులు, అందరూ చూడదగ్గ
లఘు చిత్రాలు, సినీ ప్రపంచంలోని వార్తలు విశేషాలతో పాటు ప్రముఖుల
పరిచయాలు, వారితో ఇంటర్వ్యూలు కూడా నవతరంగంలో చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటికి 40 సభ్యులు నవతరంగంలో చేరి తమ వ్యాసాలను రెగ్యులర్ గా
ప్రచురిస్తున్నారు. వీరిలో చాలామంది ప్రముఖ తెలుగు బ్లాగర్లు కూడా
ఉన్నారు.
మంచి సినిమాలను ప్రోత్సా హించే సహృదయులైన పాఠకులనుండి నవతరంగం రచనలను ఆహ్వనిస్తుంది. తెలుగు యూనికోడ్ ఫాంట్లలో వెలువడుతున్న ఏకైక తెలుగువెబ్ సైటు నవతరంగానికి మీరచనలు అందజేయటం ఎంతో సులభం.తక్కిన వివరాలకోసం సందర్శించండి http://navatarangam.com/