Thursday, August 14, 2008

సినిమా రచనలకు స్వాగతం!

సినిమా రచనలకు స్వాగతం!
Animations - feather writes



తెలుగు బ్లాగులప్రపంచంలో ఇవ్వాళ ఎందరో సినిమాలను గురించి వైవిధ్యభరితమైన రచనలను వెలువరిస్తున్నారు.సాధారణంగా పత్రికల్లో వెబ్ సైటుల్లో,టీవీ చానళ్ళలో ఎప్పుడూ కనివిని ఎరుగని రీతిలో సినిమాలను గురించి బ్లాగర్లు రాస్తున్నారు.గతంలోలా కొన్ని వెబ్ సైట్లు ఇచ్చే రేటింగులను బట్టి కాకుండా ఇప్పుడు తెలుగుబ్లాగులు చదివి సినిమాలను చూడాలా?మానాలా అనే స్థాయికి పాఠకులు చేరుకున్నారంటే,వారిని చిత్రహింసలనుంచి,చిత్రవధలనుంచీ తప్పిస్తున్న బ్లాగర్లదే అపుణ్యమంతా.
జనవరి ఒకటో తారీఖు,2008 న ప్రారంభమయిన నవతరంగం.కాం - దినదినప్రవర్ధమానమై పాఠకాదరణలో ప్రధమస్థానానికి చేరువుతూ ఉంది.నిర్వాహకులుగా మేమెవ్వరమూ ఊహించని స్థాయిలో అంటే వ్యాసాల సంఖ్యాపరంగా,వస్తువైవిధ్యపరంగా,కామెంట్ల పరంగా,విజిట్ల పరంగా ఇలా ప్రతిరోజూ కనీసం ఒక్క కొత్తవ్యాసం,విశ్లేషణతో వెలువడుతుంది.
రాబోయే నాలుగు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam [at] gmail [dot] com కు పంపగలరు.
సెప్టెంబరు:డేవిడ్ లీన్
అక్టోబరు:బాపు
నవంబరు:Andrzej Wajda
డిశెంబరు:???(ఈ నెలలో ఎవరి మీద ఫోకస్ చేయాలో మీరే నిర్ణయించండి. ఫలానా దర్శకుడు అని మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మంది కోరిన దర్శకునిపై ఈ నెల ఫోకస్ శీర్షిక నడుస్తుంది.)
అలాగే ఈ సంవత్సరం చక్రపాణి గారి శతజయంతి సంవత్సరం కాబట్టి చక్రపాణీ గారి గురించి ఒక ప్రత్యేక శీర్షికలో వ్యాసాలు ప్రచురించాలనుకుంటున్నాము. ఈ శీర్షిక కోసం కూడా పాఠకులు తమ వ్యాసాలను పంపించవచ్చు.
ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు.
వివరాల కొరకు navatarangam [at] gmail [dot] com కు మెయిల్ చేయగలరు.
నవతరంగం పాఠకుల సలహాలు అభిప్రాయాలు కూడా కోరుతోంది. గత ఎనిమిది నెలలుగా దాదాపు ప్రతి రోజూ ఒక వ్యాసంతో పాఠకులను అలరిస్తున్న ఈ వెబ్ సైటు ని మరింత మందికి చేరేలా చేయడానికి, మరిన్ని వ్యాసాలు రావడానికి తెలుగు సినిమాపై ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయాలో మీ అభిప్రాయాలు, సలహాల ద్వారా తెలుపండి.
పోలేండ్ దేశపు ప్రముఖచిత్ర దర్శకుడు అండ్రెజ్ వజ్డా




ఇటీవల చక్రపాణి జయంతి సందర్భంగా రెండు తెలుగు దినపత్రికల్లో వచ్చిన వ్యాసాలు
అలాగే తెలుగుపీపుల్ డాట్ కాం వారు ప్రచురించిన వ్యాసం http://www.telugupeople.com/cinema/MultiContentNew.aspx?contentID=17179&page=1




బాపు

ఇక మన బాపు గురించిన అందమైన,అపురూపసమాచారం ఇక్కడ http://www.bapubomma.com/budugu9.htm#down నిక్షిప్తమై ఉంది.



డేవిడ్ లీన్






సావిత్రి

తెలుగువారి అభినయస్తిరాస్థి అభినేత్రి సావిత్రి గురించి కూడా మీ వ్యాసాలు పంపగలరు.



4 comments:

మాగంటి వంశీ మోహన్ said...

చక్రపాణి మీద ఏ పత్రిక రాసింది చూసినా కొత్తదనం ఏమీ కనపడట్లా, అన్నీ రావికొండలరావుగారి బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలోని ప్రింట్లే..కొద్దిగా అటూ ఇటూ మాటల తేడాతో. కొన్నయితే కనీసం రెఫరెన్సుకోసం ఆయన పేరుకూడా తలవలా... అసలు రావికొండలరావు గారు ఎక్కడినుంచి రాసారో అని అనుమానం వస్తోంది ఇప్పుడు .. :)

Rajendra Devarapalli said...

ధన్యవాదాలు వంశీ గారు,మీరన్నమాట అక్షరాలా నిజం.రావికొండలరావు గారికి చక్రపాణి గారితో సుదీర్ఘమైన వ్యక్తిగత పరిచయముంది.:)

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర గారు,
చక్రపాణి గారి గురించి (వ్యక్తిగతం నుంచి, సినిమా రంగం, పత్రికా రంగం వరకు) ఏ సమాచారం కావాలన్నా నేనివ్వగలను. శ్రీ వెలగా వెంకటప్పయ్య(తెనాలి) గారు వేసిన 'చక్రపాణీయం ' పుస్తకం నా దగ్గరుంది. అది ఆయన్ స్మృత్యర్ధం వేసిన పుస్తకం. అందులో చక్కన్న గారు రాసిన సినిమా కథల స్క్రీన్ ప్లే లు, ఆయన రాసిన సరదా స్కెచ్ లూ కూడా ఉన్నాయి. అంతే కాక, గుండమ్మ కథ పొడిగించి కూతుళ్ళ కథతో తీస్తే ఎలా ఉంటుందో రాసిన ఒక కథ ఉంది. ఆయన గురించి అందరి అభిప్రాయలు, పరిచయాలు,అనుభవాలతో కూడిన వ్యాసాలు కూడా ఉన్నాయి. పుస్తకం మీకు అందుబాటులో ఉంటే మీరే రాయచ్చు, ఆయన గురించి.

Rajendra Devarapalli said...

ధన్యవాదాలు సుజాత గారు,మీరిచ్చిన వివరాలు చాలా ఉపయుక్తం,కానీ :) మన బ్లాగరులకు వారివారి అనుభవాలు.ధృక్కోణాలనుండి రాసి మిగిలినపాఠకలోకానికి చక్రపాణి గారి గురించీ,అలాగే మీలాంటి వారు సావిత్రి,బాపు గురించి రాయటానికి మీ స్వీయానుభవాలు చాలవంటారా??