Friday, November 28, 2008

ఇదే చివరి టపా


ఏప్రిల్ నెలలో ఒక్కటపాతో మొదలై మధ్యలో నాలుగు నెలల సుదీర్గ విరామం తో ఆగస్టు నెలలో రెండు,సెప్టెంబరులో ఒకటి అక్టోబర్ లొఇరవై ఒకటి,నవంబరులొ మొత్తం ముప్పైఏడు టపాలతో వెలువడ్డ ఈ బ్లాగుకు ఇదే చివరి టపా.మొత్తం మూడు వేలమంది సందర్శకులు వీక్షించారు,కామెంట్లు మాత్రం పది లోపే.
శెలవు

Happy First Anniversary





Happy First Anniversary to NavatarangaM

http://navatarangam.com/2008/11/help-navatarangam/

Monday, November 24, 2008

యువరాజ్ సినిమా సమీక్ష


యువరాజు..ఒకరోజు

అమాయికత్వంలోంచే క్రియేటివిటీ పుడుతుంది. అన్నీ తెలిస్తే ఏమీ సృజించలేము అని చాలా సార్లు విన్నాను. చెప్పేది క్రియేటివిటి చచ్చిపోయిన వాళ్ళే కాబట్టి నమ్మాలా…వద్దా అనే డైలమా ఉంటూండేది. అయితే ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ సృజించిన యువరాజ్ చూసిన తర్వాత వారు చెప్పేది కరెక్టే అని ఋజువైపోయింది. అందులోనూ విజిలింగ్ వుడ్స్ అనే ఇనిస్టిట్యూట్ పెట్టిన నాటి నుండి ఆయనలో ఏదో చెప్పాలన్న టీచింగ్ తాపత్రయం మరీ ఎక్కువ అవుతున్నట్లుంది. దాంతో కలసి వుంటే కలదు సుఖం,దురాశే అన్ని బాధలకు మూలం వంటి సిద్దాంతాలు మూట కట్టుకుని యువరాజు అంటూ ధియేటర్స్ లోకి దూకాడు. ఫలితం ప్రేక్షకులకు ప్రత్యక్ష్య నరకం.దాంతో యువరాజు-ఒకరోజు మాత్రమే ధియోటర్స్ ని ఏలగల్గాడు.
రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

http://navatarangam.com/2008/11/yuvvraaj-review/

వి(న్)నాయకుడు(రివ్యూ)



ఈ సినిమాను మన రెగ్యులర్ డైరక్టర్స్ చేసుంటే గ్యారింటీగా ఏ ‘బండోడి ప్రేమ’ అనే టైటిల్ పెట్టి అంతే మోటుగా సినిమా చుట్టేసేవారు. అంతేగాక ఒబిసిటిపై రకరకాల డైలాగులు,ఘోరంగా జోకులు వేసి చివరలో “అలా అనకూడదు..వాళ్ళు మనలాంటి వారే..గుర్తించండి” అని అధ్బుతమైన మెసేజ్ చెప్పేసి ఎంత గొప్ప పని చేసేమో అన్నట్లు మనవంక చూసేవారు. ఈ కొత్త డైరక్టర్ అలా పాత రూటులోకి వెళ్ళి అతి చేయ్యకపోవటమే ఈ సినిమా గొప్పతనం . నేరేషన్ స్లోగా ఉందనిపించినా,

రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

http://navatarangam.com/2008/11/vinayakudu-review/

Sunday, November 23, 2008

త్యాగయ్య గీతామృతం - నాగయ్య నటనాద్భుతం


పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము. నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక,

రచయిత: గీతాచార్య
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/tyagayya-a-classic/

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)


ఏదైనా చుట్టడమే కదా

అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని వాళ్ళు చాలా సార్లు విని ఉండటంతో సర్లే అనుకుని మద్రాస్ బయిలుదేరారు.

ఎ గ్రేట్ గైడ్

అప్పుడు మధ్యలో ఒక వ్యక్తి తగిలి నేనూ మీ వాడ్నై…మనూరూడ్నే,అంతేకాదు సినిమా వాడ్ని అన్నాడు. సర్లే ఏంటి అనుమానంగా అన్నారు. మీ వాలకం చూస్తూంటే ఎక్కడో మోసపోయేటట్లు ఉన్నారు.

రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/copy-cats/

బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం


మొదటి భాగం ఇక్కడ చదవండి.

బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు.

రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి తీసినట్టుగా వ్రాయడం ద్వారా ఆర్ట్ సినిమాలని వెక్కిరించారని ప్రసాద్ గారు వెల్లడించారు. కొండల్రావు గారు కామెడీకి రాస్తే రాసుండొచ్చు గానీ అవార్డు సినిమాలంటే ఇలానే ఉంటాయని మనవాళ్ళలో బాగా బలంగా నాటుకుపోయింది.ఆ మధ్యలో ఒక ప్రముఖ చిత్ర దర్శకుణ్ణి హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ లో జరిగిన ఒక చిత్రోత్సవం ఓపెనింగ్ కి ఆహ్వానించారు.
రచన :అన్వేషి

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/art-films-award-films-2/