Friday, November 7, 2008

సీతారామయ్య గారి మనవరాలు


సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో. ఇప్పుడు ఉన్నట్టుగా పల్లెటూళ్ళలో కూడా టెలిఫోన్ లు, ప్రతి మూడో మనిషి దగ్గర మొబైల్ ఫోన్లు పదిహేడేళ్ళ క్రితం ఉండి ఉంటే మనమంతా ”సీతారామయ్య గారి మనవరాలు’ అనే ‘తెలుగు’ సినిమాను మిస్ అయ్యేవాళ్ళం కదా! ఆర్ద్రత నిండిన కథ, కథనం, పాత్రోచిత నటన, కథనానికి ప్రాణం పోసే సంగీతం ఈ సినిమా ని క్లాసిక్ గా మార్చాయి. నా స్నేహితుల్లో కొందరు దీనిని ‘చివరి తెలుగు సినిమా’ అని అంటుంటారు. కథగా చెప్పాలంటే ఇది మూడు లైన్ల కథ. ఇచ్చిన మాటకీ ప్రాణం ఇచ్చే తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయలేని కొడుక్కి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్. ఫలితంగా ఆ కొడుకు కుటుంబానికి దూరం అవడం తిరిగి తన కూతురి ద్వారా కుటుంబాన్ని కలుసుకోవాలనుకోవడం. క్రాంతి కుమార్ దర్శకత్వం, కీరవాణి సంగీతం, నాగేశ్వర రావు , రోహిణి హట్టంగడి, మీనా ల నటన ఈ సాధారణ కథ ఓ అసాధారణ సినిమా గా రూపు దిద్దుకోడానికి తోడ్పడ్డాయి.

‘మానస’ రాసిన ‘నవ్వినా కన్నీళ్ళే’ నవల ఆధారంగా (ఈ నవల ఎక్కడ దొరుకుతుందో ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు)

మిగిలిన భాగం ఇక్కడ

రచన:మురళి
http://navatarangam.com/2008/11/seetaramaiahgari-manavaralu/

No comments: