Sunday, November 2, 2008

పథేర్ పాంచాలి సినిమా పరిచయం

(”పథేర్ పాంచాలి”, “అపరాజితో”, “అపు సంసార్” పేర్లతో అదే వరసలో బెంగాలీలో “అపు చిత్రత్రయం” గా తీసిన సత్యజిత్ రాయ్ సినిమాలలో మొదటి సినిమా “పథేర్ పాంచాలి” ని ఇక్కడ పరిచయం చేస్తున్నా. ఈ మూడు సినిమాలకి మూలం, బెంగాలీలో వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల.)

దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమాతోనే ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న “పథేర్ పాంచాలి” సినిమాతో, దర్శకుడిగా సినిమారంగేట్రం చేసాడు రాయ్. 1955 సంవత్సరంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిర్మాతగా నిర్మించిన చిత్రం ఇది. ఈ వ్యాసం చివర ఇచ్చిన ప్రశంసల జాబితా వల్ల, మొదటి సినిమాతో ప్రపంచంలో సంచలనం రేపిన అరుదైన సినిమా దర్శకుల జాబితాలో రాయ్ పేరు చోటు చేసుకుంది.

ఏమిటి ఈ సినిమా గొప్పతనం?

రెండు మాటల్లో చెప్పాలంటే, “కళా ప్రదర్శన”. అంటే, సినిమా అన్న మాధ్యమం ఉపయోగిస్తూ అత్యంత కళాత్మకంగా తీసిన మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమాని పేర్కొనవచ్చు. అప్పటి వరకు, భారతీయ గ్రామీణ జీవితాన్ని కాని, లేదా పట్టణ జీవితాన్ని కాని సంగ్రహంగా చూపించే సినిమాలు బహుశా రాలేదని అనుకోవాలి! అసలు ఈ సినిమా కథను ఎంచుకోటంలోనే రాయ్ గొప్పతనం కనపడుతుంది. ఈ సినిమా కథను, ఒక కథగా చూస్తే, అతి చప్పగా, అద్భుతంగా ఉండే ఎటువంటి సంఘటనా లేనటువంటి కథ ఇది.
రచన :విష్ణుభొట్ల లక్ష్మన్న
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
ఇక్కడ

No comments: