Sunday, November 9, 2008

Katyn


’చరిత్ర ఎప్పుడూ విజేతల చేతే వ్రాయబడుతుంద’ని ఒక నానుడి. అందుకే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని వచ్చిన చిత్రాల్లో సామాన్యంగా ఎప్పుడూ హిట్లర్ అనుయాయులైన నాజీలనే దోషులుగా చూస్తాం. ఏమాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా చరిత్రని వక్రీకరించారని నింద వేస్తారు. ఎన్నో లక్షలమంది ప్రాణాలు బలిగొన్న రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్ర పేజీల్లోకి ఎక్కని నిజాలెన్నో. కేవలం విజేతల విజయగాధలు, నాజీల అకృత్యాలతో నిండిపోయిన ఈ చరిత్ర పుస్తకంలో మరుగున పడిపోయిన భయంకరమైన మూకుమ్మడి హత్యల్ని బయటపెట్టే ధైర్యం ఈరోజుకీ కూడా చాలామందికి లేదు. కానీ మొదటి నుండీ సినిమాని ఆయుధంగా వాడడంలో ఆరితేరిపోయిన ఆండ్రే వైదాకి మాత్రం ఆ సమస్య లేదు. 1940 katyn అడవిలో ఊచకోతకు గురైన ఇరవై వేలమంది పోలిష్ సైనికుల ఆత్మఘోషను కళ్ళముందు ఉంచడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. గత సంవత్సరం ఆస్కార్‍కి నామినేట్ అయిన ఈ పోలీష్ సినిమా Katyn మిగతా యుద్ధనేపధ్య సినిమాల కంటే భిన్నంగా ఉండడానికి ప్రధాణ కారణం ఈ సినిమాకి ఆండ్రే వైద్యా దర్శకుడు కావడమే(ఈయన గురించి నవతరంగంలో ఇప్పటికే ఒక అండ్రే వైదా" href="http://navatarangam.com/2008/11/andrzej-wajda/" target="_blank">పరిచయ వ్యాసం వచ్చింది).

మిగిలిన భాగం ఇక్కడ
http://navatarangam.com/2008/11/katyn-by-andrzej-wajda/

No comments: