Thursday, November 6, 2008

ఆండ్రే వైదా-ఒక పరిచయం


పరిచయం:

అయనకి సినిమా ఒక ఆయుధం. ఆయనకి సినిమా ఒక సాధనం. ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్ శీర్షికలో దృష్టి సారిస్తున్న సందర్భంగా ఆయన సినిమాల జీవిత విశేషాలతో కూడుకున్న పరిచయవ్యాసం ఇది.

డబ్లిన్ పట్టణం మొత్తం నాశనమైపోయినా “తన నవలల్లోని సమాచారం ద్వారా తిరిగి అలాగే నిర్మించొచ్చు” అని James Joyce అన్నదాంట్లో ఎంత నిజముందో తెలియదుకానీ వైదా సినిమాల ద్వారా పోలండ్ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలకు దృశ్యరూపమిచ్చి ఆ దేశ చరిత్రను తన సినిమాల ద్వారా పునర్నిర్మించారని ఆయన సినిమాలు చూసిన ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. సినిమాలు కేవలం వినోదం కోసమే కాదని వాటి ద్వారా ఎంతో సాధించవచ్చని నమ్మినవారిలో ముఖ్యుడు వైదా. మార్చి 6, 1926 న పోలండ్ లోని సువాల్కి లో జన్మించిన ఆండ్రే వైదా (Andrzej Wajda) ప్రపంచంలోని అత్యుత్తమ సినిమా దర్శకుల్లో ఒకరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


రచన : శిద్దారెడ్డి వెంకట్

మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/andrzej-wajda/



No comments: