Sunday, November 2, 2008

ఫ్యాషన్ సినీ సమీక్ష


ఇంతకు ముందే నేను ఫ్యాషన్ సినిమా చూశాను. దాని కోసం మా కజిన్ ని తీసుకెళ్ళాను. నాకేమన్నా పిచ్చి ఎక్కితే తిన్నగా ఇంటికి తీసుకెళ్తాడని. ఐతే ఆ అవసరం రాలేదు. నిజం గా మాథుర్ భండార్కర్ మాథుర్ భండార్కరే!

ఎంతో కాలంగా ఆ సినిమా గురించి వింటున్నాను. అతని గురించి కూడా వింటూనే ఉన్నాను. ‘చాందినీ బార్’, ‘ట్రాఫిక్’, ‘పేజ్ -౩’ మొదలైన సినిమాలతో ఖ్యాతి గడించిన అతను ఈ సారి Fashion world మీద దృష్టి పెట్టాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండీ మా ఫ్రెండ్స్ అంతా లొట్టలేసుకుంటూ ఎదురు చూడ సాగారు. దాంతో నాకు ఆ సినిమా మీద ఒక వేరే అభిప్రాయం మొదలైంది.

ఎట్టకేలకు ఆ సినిమా రానే వచ్చింది. ఏదేమైనా సరే! చూసేద్దాం. ఐతే విజువల్ ఫీస్ట్, లేక పోతే మంచి సినిమా చూసిన అనుభవం దక్కుతుందని, మా ఫెండ్స్ కి చెప్పకుండా మా వాడితో వెళ్ళాను. వెళ్ళెటప్పటికే సినిమా మొదలైంది. ప్రియాంకా చోప్రా తెర మీద ఉంది. మా వాడి కళ్ళూ వెలిగాయి అనుకుంటా. చీకట్లొ కనపడలేదు. నాకు మాత్రం వెలిగినట్టు అనిపించింది. సుత్తిసరె!
రచన:గీతాచార్య
మిగిలిభాగం ఇక్కడ

No comments: