Sunday, November 2, 2008

మనము సినిమాలెందుకు చూస్తాం?


ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము?

టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే, పరోక్షంగా సంతృప్తి పొనదటానికి అన్నది మానసిక శాస్త్రి సమాధానం.ఇలా సినిమాలెందుకు చూస్తాము అన్నదానికి రకరకాల సమాధానాలొస్తాయి. అసలు సినిమాలెందుకు చూడాలి? అని మనల్ని మనము ప్రశ్నించుకుని లోతుగా విశ్లేషించుకుంటే, సినిమాలెందుకు చూడాలో మాత్రమే కాదు, సినిమాల ప్రాధాన్యం, మనపైన అవి చూపే ప్రభావం, సినీ కళాకారుల బాధ్యత వంటి విషయాలు కూడా మనకు అర్ధమవుతాయి.





రచన:కస్తూరి మురళీ కృష్ణ
మిగిలిభాగం


ఇక్కడ

చదవండి

No comments: