Tuesday, November 11, 2008

నిశ్శబ్ద్ - పోస్టర్ మీద ‘అతనికి 60, ఆమెకు 18′


నిశ్శబ్ద్ - పోస్టర్ మీద ‘అతనికి 60, ఆమెకు 18′ అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది.

నిజంగా చెప్పాలంటే, ప్రేమకు వయసు, కారణం.. ఇలాంటివన్నీ ఉండవు. సినిమాల్లో అయితే మరీ గ్లోరిఫై అయిన ప్రేమ - మొదటి చూపు లోనే ప్రేమ - ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, చంపడం లేదా చచ్చిపోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాము గాబట్టి మనకవన్నీ అలవాటే. నిజ జీవితం లో ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన ఒక గృహస్థు (భార్యా, పిల్లలు కలవాడు) తన వయసులో కన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని ప్రేమించడం -

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/nisabdh/


రచన :సుజాత

1 comment:

సుజాత వేల్పూరి said...

నవతరంగంలో కామెంట్స్ పోస్ట్ కావట్లేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా! ఈ సినిమాని ఒక సారి నేను అమెరికాలో ఉన్న రోజుల్లో ఒక మూవీ చానెల్లో ఇంగ్లీష్ లో చూశాను. పేరు గుర్తు లేదు. అందులో కూడా కథా నాయకుడు అరవయ్యేళ్ళు పైబడ్డ ఫొటోగ్రాఫరే! కథా నాయిక పదారేళ్ళ పాపాయే! అతడి దగ్గర ఫొటోగ్రఫీ నేర్చుకునేందుకు వస్తుంది. తర్వాత వాళ్ళు ప్రేమలో పడటం! కథానాయిక తల్లి దండ్రులు విడిగా జీవిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆ పిల్ల అతడికి దగ్గరవుతుంది.అతడి ఫ్లాట్ కి వచ్చేసి అతడితోనే ఉంటుంది.

మొత్తం గుర్తు లేదు. చివరికి అతడు ఏదో వ్యాధితో మరణిస్తాడు. అతడి కెమెరా మాత్రం గుర్తుగా ఆమె దగ్గర మిగిలిపోతుంది. ఈ సినిమా పేరేమిటో ఎవరికైనా తెలుసా?

నిశ్శబ్ద్ సినిమా విషయానికొస్తే.....ట్రబుల్డ్ టీనేజర్లు కొంచెం "ఆప్యాయతలకే" కరిగిపోవడం, concern పెంచుకోవడం వల్ల ఇలాంటివి సంభవిస్తాయని కొన్ని అనిపిస్తుంది. దాన్ని ఎడ్వాంటేజ్ గా తీసుకోడానికి విజయ్ లాంటి మేధావులకెంత సేపు పడుతుంది?

ఈ సినిమాలో అతడు సగటు మనిషి కాదు. కుటుంబం, కళాకారిణి(ఒకప్పుడైనా సరే) అయిన భార్య, సంఘంలో గౌరవనీయమైన స్థానం కల వ్యక్తి! అయినా కూడా కూతురి స్నేహితురాల్ని కురచ బట్టల్లో చూసి (పోనీ బట్టల వల్ల కాకపోయినా) tempt అయ్యేంత బలహీనుడవ్వాలా? రహస్యంగా తన అనుబంధాన్ని కొనసాగించడానికి సిద్ధపడ్డ వ్యక్తిగా అతడిని ఎలా గౌరవించాలో?

వీటికి సమాధానమేమిటంటే..."ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు. it just happens! ఎవరూ కావాలని ప్రేమలో పడరు. ఈ సినిమా చూసినపుడు నాకూ ఇదే అనిపించింది.