Friday, November 28, 2008

ఇదే చివరి టపా


ఏప్రిల్ నెలలో ఒక్కటపాతో మొదలై మధ్యలో నాలుగు నెలల సుదీర్గ విరామం తో ఆగస్టు నెలలో రెండు,సెప్టెంబరులో ఒకటి అక్టోబర్ లొఇరవై ఒకటి,నవంబరులొ మొత్తం ముప్పైఏడు టపాలతో వెలువడ్డ ఈ బ్లాగుకు ఇదే చివరి టపా.మొత్తం మూడు వేలమంది సందర్శకులు వీక్షించారు,కామెంట్లు మాత్రం పది లోపే.
శెలవు

Happy First Anniversary





Happy First Anniversary to NavatarangaM

http://navatarangam.com/2008/11/help-navatarangam/

Monday, November 24, 2008

యువరాజ్ సినిమా సమీక్ష


యువరాజు..ఒకరోజు

అమాయికత్వంలోంచే క్రియేటివిటీ పుడుతుంది. అన్నీ తెలిస్తే ఏమీ సృజించలేము అని చాలా సార్లు విన్నాను. చెప్పేది క్రియేటివిటి చచ్చిపోయిన వాళ్ళే కాబట్టి నమ్మాలా…వద్దా అనే డైలమా ఉంటూండేది. అయితే ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ సృజించిన యువరాజ్ చూసిన తర్వాత వారు చెప్పేది కరెక్టే అని ఋజువైపోయింది. అందులోనూ విజిలింగ్ వుడ్స్ అనే ఇనిస్టిట్యూట్ పెట్టిన నాటి నుండి ఆయనలో ఏదో చెప్పాలన్న టీచింగ్ తాపత్రయం మరీ ఎక్కువ అవుతున్నట్లుంది. దాంతో కలసి వుంటే కలదు సుఖం,దురాశే అన్ని బాధలకు మూలం వంటి సిద్దాంతాలు మూట కట్టుకుని యువరాజు అంటూ ధియేటర్స్ లోకి దూకాడు. ఫలితం ప్రేక్షకులకు ప్రత్యక్ష్య నరకం.దాంతో యువరాజు-ఒకరోజు మాత్రమే ధియోటర్స్ ని ఏలగల్గాడు.
రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

http://navatarangam.com/2008/11/yuvvraaj-review/

వి(న్)నాయకుడు(రివ్యూ)



ఈ సినిమాను మన రెగ్యులర్ డైరక్టర్స్ చేసుంటే గ్యారింటీగా ఏ ‘బండోడి ప్రేమ’ అనే టైటిల్ పెట్టి అంతే మోటుగా సినిమా చుట్టేసేవారు. అంతేగాక ఒబిసిటిపై రకరకాల డైలాగులు,ఘోరంగా జోకులు వేసి చివరలో “అలా అనకూడదు..వాళ్ళు మనలాంటి వారే..గుర్తించండి” అని అధ్బుతమైన మెసేజ్ చెప్పేసి ఎంత గొప్ప పని చేసేమో అన్నట్లు మనవంక చూసేవారు. ఈ కొత్త డైరక్టర్ అలా పాత రూటులోకి వెళ్ళి అతి చేయ్యకపోవటమే ఈ సినిమా గొప్పతనం . నేరేషన్ స్లోగా ఉందనిపించినా,

రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

http://navatarangam.com/2008/11/vinayakudu-review/

Sunday, November 23, 2008

త్యాగయ్య గీతామృతం - నాగయ్య నటనాద్భుతం


పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము. నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక,

రచయిత: గీతాచార్య
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/tyagayya-a-classic/

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)


ఏదైనా చుట్టడమే కదా

అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని వాళ్ళు చాలా సార్లు విని ఉండటంతో సర్లే అనుకుని మద్రాస్ బయిలుదేరారు.

ఎ గ్రేట్ గైడ్

అప్పుడు మధ్యలో ఒక వ్యక్తి తగిలి నేనూ మీ వాడ్నై…మనూరూడ్నే,అంతేకాదు సినిమా వాడ్ని అన్నాడు. సర్లే ఏంటి అనుమానంగా అన్నారు. మీ వాలకం చూస్తూంటే ఎక్కడో మోసపోయేటట్లు ఉన్నారు.

రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/copy-cats/

బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం


మొదటి భాగం ఇక్కడ చదవండి.

బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు.

రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి తీసినట్టుగా వ్రాయడం ద్వారా ఆర్ట్ సినిమాలని వెక్కిరించారని ప్రసాద్ గారు వెల్లడించారు. కొండల్రావు గారు కామెడీకి రాస్తే రాసుండొచ్చు గానీ అవార్డు సినిమాలంటే ఇలానే ఉంటాయని మనవాళ్ళలో బాగా బలంగా నాటుకుపోయింది.ఆ మధ్యలో ఒక ప్రముఖ చిత్ర దర్శకుణ్ణి హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ లో జరిగిన ఒక చిత్రోత్సవం ఓపెనింగ్ కి ఆహ్వానించారు.
రచన :అన్వేషి

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/art-films-award-films-2/

Friday, November 21, 2008

బ్లాక్ &వైట్ సినిమా గురించి


ఇది కాస్త లో ప్రొఫైల్గా వచ్చి వెళ్ళిన తెలుగు సినిమా అనుకుంటా. టీవీలో యాడ్స్ చూసి సినిమా ఏదో ఆసక్తికరంగా ఉండేలాగుందే అనుకున్నాను. అయితే, ఇంకా రిలీజ్ కాలేదేమో అనుకున్నాను. ఆగస్టులోనే రిలీజైందని తెలుగుసినిమా.కామ్ సైటులో ఈ సినిమా గురించి రాసిన వ్యాసంతో అర్థమైంది. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

కథ: భరత్ (రాజీవ్ కనకాల) ఓ సాఫ్ట్‍వేర్ ఇంజినీరు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లాండ్‍మైన్ అటాక్ నుండి కొంతమంది పోలీసులను కాపాడి రాష్ట్రపతి ఇచ్చే సిటిజెన్ అవార్డుకి ఎన్నికౌతాడు. అతను అనాథగా పెరిగి స్వశక్తితో పైకొచ్చినవాడు. అతని ప్రాణస్నేహితుడు శీను, ఆఫీసు, ఇంటి దగ్గరుండే పిల్లలు - ఇదే అతని ప్రపంచం. ఇక్కడ మొదలౌతుంది మన కథ. తర్వాత ఓ అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. ఈ సమయంలోనే అతనిపై ఎవరో దాడులు చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ అతను తప్పించుకుంటూ ఉంటాడు. ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు.
రచన:సౌమ్య
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/black-white-2008/

కోకిల సినిమా


అర్థరాత్రి అంతర్గతంగా ఉన్న ఏ కోరిక వల్లో ఈ సినిమా చూశాను. చిన్నప్పుడు ఈ సినిమా అంటే ఇష్టంగా ఉండేదన్న విషయం ఐతే గుర్తు ఉంది కానీ, డిటైల్స్ గుర్తు లేవు - కథ విషయం తప్ప. ఈరోజు ఆ సినిమా చూశాక నా పాత అభిప్రాయం ఎంత మారిపోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ టపా.

కథ విషయానికొస్తే, కోకిల ఓ టీవీ గాయని. సిద్ధార్థ ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తరువాత ఓ ప్రమాదంలో సిద్ధార్థ కళ్ళు పోతాయి. అతనికి ఆరోజే హత్య వల్ల మరణించిన రిషీకేశ స్వామీజీ కళ్ళని అమరుస్తారు. కానీ, అప్పట్నుంచి సిద్ధార్థ కళ్ళు తెరిచినప్పుడల్లా అతనికి ఎవరో తనని హత్య చేయడానికి ప్రయత్నించే దృశ్యం కనబడుతూ ఉంటుంది. అవి ఆ స్వామీజీ కళ్ళు కనుక, ఇతని ద్వారా హంతకుణ్ణి పట్టుకోవచ్చు అన్నది పోలీసుల ఆలోచన. కానీ, కళ్ళు తెరిచిన ప్రతిసారీ సిద్ధార్థ అలజడికి గురవడం చూసి....
రచన:సౌమ్య

మిగిలిన భాగం ఇక్కడ చదవండి



http://navatarangam.com/2008/11/kokila-1989/

Thursday, November 20, 2008

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్


సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ల గురించి కొంత చెప్పాలి. వీధి నాటకాలకి ఆదరణ తగ్గి, పల్లెల్లో ఉత్సవాలకి 16mm తెరపై సినిమాలు ప్రదర్శించే పధ్ధతి ప్రారంభం కాడానికి ముందు, అంటే డెబ్బై, ఎనభై దశకాలలో ఈ ట్రూప్ లు పల్లె ప్రజలకు వినోదాన్ని అందించాయి. ప్రారంభంలో వీరి నృత్యాలు అశ్లీలానికి దూరంగా ఉన్నా, ట్రూప్ ల మధ్య పెరిగిన పోటీ కారణంగా తరువాతి కాలంలో అసభ్య ప్రదర్శనలు మొదలయ్యాయి. వంశీ ‘మా పసలపూడి కథలు’ లో ‘పాముల నాగేశ్వర రావు’ ‘కుమారి మా ఊరొచ్చింది’ కథల్లో ఈ ట్రూప్ ల ఒకనాటి వైభవాన్ని తెలుసుకోవచ్చు. (అంబాసిడర్ కార్లలో వచ్చే ట్రూప్ సభ్యులకు సిని తారలకు ఉన్నంత ఆదరణా ఉండేది.) ఈ ట్రూప్ లు ఉచ్ఛదశలో ఉన్నకాలంనాటి కథ ఇది.

రచన;మురళి
మిగిలిన భాగం ఇక్కడ
http://navatarangam.com/2008/11/kanakamahalakshmi-recording-dance-troup/

కొత్తపాళీ సైకిలు దొంగలు


ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు.

ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
రచన:కొత్తపాళీ
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/the-bicycle-thief-italian-1948/

Wednesday, November 19, 2008

మనసు ముంగిట్లో వెలిగిన ప్రేమ దీపం-’చిత్ చోర్’


అతడు కళ్ళూ, మనసూ చెదిరే అందగాడు కాదు. ఆరడుగుల ఆజానుబాహుడూ కాదు. ఆరుపెట్టెల దేహముదురూ కాదు! ఆమె తళుకుబెళుకుల మెరుపు తీగా కాదు. అందం కుప్ప బోసిన సౌందర్య రాశీ కాదు. అతడు మృదుస్వభావి, సంగీత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు! ఆమె పల్లెటూరి ముగ్ధ! అయినా సిగ్గుపడి తలుపు చాటుకి తప్పుకునే సిగ్గరి కాదు. అతడు మన పక్కింటబ్బాయి! ఆమె మన ఎదురింటమ్మాయి.

వారిద్దరి నిర్మలమైన ప్రేమ కథే “చిత్ చోర్ ”


రచన:సుజాత (మనసులో మాట)
మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/chit-chor/

ప్రముఖ నటుడు నంబియార్ మృతి


ప్రముఖ తమిళ నటుడు మంజరీ నారాయణన్ నంబియార్(ఎమ్.ఎన్.నంబియార్)(89) ఈ రోజు మధ్యాహ్నం(బుధవారం) చెన్నై లోని ఆయన స్వగృహంలో మరణించారు.గత కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఈయన కొద్ది రోజుల క్రిందటే ఆసుపత్రి నుండి డిస్ఛార్చ్ అయ్యారు. నంబియార్ మార్చి ఏడు,1919 లో కేరళలోని కన్నూరులో జన్మించారు.ఆయన మొదటి సినిమా భక్త రామ్ దాస్(1935) హిందీ,తమిళ్ లో చేసారు. తమిళ సినిమాకు మొదటి విలన్ గా ఆయనను చెపుతూంటారు. ఆయన తెరమీదకు రాగానే అప్పట్లో టప్పుట్లు పడేవంటారు.స్టేజి ఆర్టిస్టుగా ప్రూవ్ అయి సినిమాల్లోకి రావటంతో పెద్ద పెద్ద నటులు సైతం ఆయన సలహాలు కోరేవారని చెప్పుకుంటూంటారు. ఎమ్.జి.ఆర్ ఫార్ములా సినిమాలు ఈయన విలన్ గా లేకపోతే...

రచన:జోస్యుల సూర్యప్రకాశ్

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/mn-nambira-passed-away/

Tuesday, November 18, 2008

శుభలేఖ


విశ్వనాథ్ సినిమాల్లో నాకు విపరీతంగా నచ్చిన సినిమాల్లో శుభలేఖ మొదటి ఐదింటిలో ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లే చూసాను కానీ, ఈ మధ్యే మళ్ళీ చూసాను. చూసాక, ఈసారైనా దీని గురించి నా అభిప్రాయాలు రాయాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చేసేరోజుల్లో మా కాలేజీ విద్యార్థుల్లో రచనాసక్తి ఉన్నవారికి ఓ వెబ్సైటు ఉండేది. అందులో దీని గురించి ఇంగ్లీషులో రాసానోసారి. కానీ, ఇప్పుడాసైటూ లేదు, ఆ వ్యాసం ఏమైందో అంతకంటే తెలీదు.

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

రచన:సౌమ్య

http://navatarangam.com/2008/11/subhalekha-1982/

దోస్తానా




ఏం..ఎప్పుడూ మూస కథలేనా కాస్త అప్పుడప్పుడూ సరదాకైనా ప్రయోగాలు చెయ్యచ్చుకదా…అని మనం విసుక్కోవటం బబుల్ గమ్ సినిమాలు తీస్తాడని పేరు పడ్డ కరణ్ జోహార్ చెవిన పడ్డట్టుంది. పాపం వాళ్ళన్నది కరెక్టే కదా అనుకుని వెంటనే రంగంలోకి దూకి దోస్తానా తయారు చేసి వదిలాడు. వెరైటీ అంటూ అంతలా తయారు చేసిన సినిమా స్పెషల్ ఏంటంటారా అదే…మనం ఊహించటానికి కూడా కాస్త సంశయించే గే కామిడి. అయితే ఈ సినిమా గ్యారంటీగా హాలీవుడ్ ఫ్రీమేక్ అయ్యుంటందని ఫిక్సవ్వద్దు..అది మన వాళ్ళ బుర్రల్లోంచి హండ్రడ్ పర్శంట్ పుట్టిందే. ఇలాంటి సినిమా ఇండియన్ జనాలికి నచ్చిందా అంటే పిచ్చపిచ్చగా నచ్చిందని భారీ కలెక్షన్స్ చెపుతున్నాయి.ఇలా అంతా ఆశ్చర్యపోతారనే…కథ నేపధ్యాన్ని తెలివిగా మియామి లో తీసుకున్నాడు. ఫారిన్ కంట్రి కాబట్టి అక్కడ ఇలాంటివి మామూలే అని మనకు అనిపించాలనే ఆయన ఉద్దేశం కావచ్చు.


http://navatarangam.com/2008/11/dostana-review/

జానతెలుగుపాటల పుంస్కోకిల - ఒక స్మృత్యాంజలి





తను తెలుగు వాడిగా — వాడిగా తెలుగు వ్రాయగల వాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే.

నేను తెలుగు వాడినై — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాడినై — పుట్టడం నా అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచన చదివితే.

పానగల్ పార్కులోని పేరులేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వవిద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావసరస్వతి — ఆయన.

రూపాయ చేసే సెకెండు హ్యాండు పుస్తకాన్ని “విలువ” తెలిసి రెండున్నర పెట్టి కొనుకున్న జోహారి — మేలిమి వజ్రాల బేహారి —ఆయన.

తన రచనలు వేరొకరి పేరుతో చెలామణీ అయినా తనకు అందాల్సిన శ్రీ యశః కీర్తులు వేరొకరి పరమయినా చిరునవ్వే సమాధానంగా కూర్చున్న గుప్తదానపథ సంచారవర్తి — సాక్షాత్ శిబి చక్రవర్తి — ఆయన.


http://navatarangam.com/2008/11/malladi/

Sunday, November 16, 2008

మన సినిమాలెందుకు మూస దాటవు?


తెలుగు సినిమాలేకాదు, భారతీయ సినిమాలు చూసేవారెవరినయినా వేధిస్తూన్న ప్రశ్న ఇది?

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే మన దేశం సినిమాలు నాణ్యత విషయంలోకానీ, సాంకేతికామ్షాలలో కానీ, కథామ్షాలలో కానీ ఇతర చిన్న చిన్న దేశాల సినిమాలతో పోలిస్తే తేలి పోతాయి.

మన దగ్గర మెగా స్టార్లున్నారు. సూపర్ స్టార్లున్నారు. పవర్ స్టార్లున్నారు. కానీ చెప్పుకోటానికి ఒక్క మంచి అంతర్జాతీయ స్థాయి సినిమా లేదు. ఎంత సేపూ, మల్లీశ్వరి, మాయా బజార్, మూగ మనసులు లాంటి కొన్ని సినిమాల పేర్లు తప్పించి వెంట వెంటనే ఒక పది సినిమాల పేర్లు గుర్తుకు రావు.

హాంగ్ కాంగ్ లో నిర్మించిన ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచ సినిమాల్లో పోరాట స్వరూపాలను మార్చేసింది. గాడ్ ఫాదర్ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్రెంచ్ సినిమాలు, ఇటలీ దేశ సినిమాలు, ఇరాన్ సినిమాలు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. కానీ మనము మాత్రం అత్యధిక సినిమాలు చూస్తూ, అత్యధిక కాలం సినిమాలు చూస్తూ గడుపుతూ, ఇతరులకు జేజేలు పలుకుతున్నాం తప్ప మనమేమి చేస్తున్నాం, ఎందుకని అంతర్జాతీయ ప్రామాణికాలకు మనం తూగటంలేదు అని ఆలోచించటం లేదు.

రచన:కస్తూరి మురళీ కృష్ణ

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/formula-films/

Saturday, November 15, 2008

తారే జమీన్ పర్ కు అస్కార్ వచ్చే అస్కారం ఎందుకు లేదంటే….


ఈ సంవత్సరం జూన్ లో ఆస్కార్ అకాడెమీ ప్రపంచంలోని 95 దేశాలనుంచి ’Best Foreign Language Film’ విభాగం లో అవార్డు ఇచ్చేందుకు గానూ నామినేషన్స్ కోరుతూ చేసిన ప్రకటనకు 67 దేశాలు స్పందించి తమ తమ నామినేషన్స్ పంపించాయి.మన దేశం నుంచి ఈ నామినేషన్స్ కు ’తారే జమీన్ పర్’ ని పంపించారు.

ఈ 67 సినిమాలతో పోటీపడి ’తారే జమీన్ పర్’ చివరి ఐదు సినిమాల లిస్టులో నిలవగలదా అంటే అనుమానమే. అందుకు కారణం దాన్ని మించిన ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ ఉన్నాయి.

రచయిత: అన్వేషి

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/tzp-oscar/

ఆవకాయ బిర్యాని-సమీక్ష


టైటిల్ వినగానే…ఏదో ఫీలింగ్ ..అందులో శేఖర్ కమ్ముల బ్యానర్ నుండి వస్తున్న సినిమా అనగానే మరికొంత ఎట్రాక్షన్..ఊ…చూసేద్దాం అని థియేటర్ లోకి దూకితే అర్దమైంది నేనెంత తప్పుచేసానో. పరిష్కారం చూపని ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ గా చెప్పాడా అంటే…మధ్యలో తెలంగాణ ఊరి సమస్యలు అంటూ ప్రభుత్వ ప్రకటనలా టార్చర్ స్టార్ట్ చేసాడు. ఇదీ ధియోటర్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్.

మహ్మద్ అక్బర్ కలామ్(కమల్ కామరాజు) దేవరకొండ అనే తెలంగాణ పల్లెలో సెవన్ సీటర్ ఆటో నడుపుతూంటాడు. లక్ష్మి(బిందు మాధవి) ఆవకాయ అమ్ముకుని కుటుంబానికి సహకరించాలనుకుని పోలవరం (ఆంధ్రా)నుంచి వలస వచ్చిన అమ్మాయి. లక్ష్మి వికారబాద్ కి వెళ్ళటానికి అక్బర్ ఆటో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మీరూహించినట్లే


రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్

మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/avakaya-biryani-review/

Friday, November 14, 2008

‘రొమాంటిక్ కామెడీలు’-వాటి రూటే వేరు!!


“ఇరవై సంవత్సరాల లోపులో ప్రేమలో పడనివాళ్ళూ, అరవై సంవత్సరాలు దాటాక ప్రేమలో పడేవాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలంటారు..ఎందుకంటే వారు ఏదో మానసిక లోపంతో కాలం గడుపుతున్నట్లు లెక్క!” అని పెద్దలు చెప్తూంటారు.ఆవకాయి బిర్యాని రిలీజ్ అయ్యింది. త్వరలో ‘వినాయుకుడు’ తన ప్రేమ కథతో ధియోటర్స్ లోకి దూకనున్నాడు. అలా శేఖర్ కమ్ముల ఆనంద్ పుణ్యమా అని మళ్ళి రొమాంటిక్ కామిడీల వైపుకు తెలుగు పరిశ్రమ మెల్లి మెల్లిగా మళ్ళుతోంది.ఈ స్దితిలో…రొమాంటిక్ కామిడీ అనే జనరంజక జాతము (Popular Genre) పై సరదాగా ఓ సైటేస్తే…

భావనాత్మక అనుబంధాలు(రొమాంటిక్ రిలేషన్షిప్స్ కి వచ్చిన తంటా) కేంద్ర బిందువుగా ఉన్న హాస్య చిత్రాలే రొమాంటిక్ కామెడీలు. ఇవి ఎలా మొదలయ్యి జనరంజకం అయ్యాయీ అంటే…ప్రపంచ సినిమా ప్రారంభంలో వచ్చిన మూకీ చిత్రాలన్నీ ఎక్కువ శాతం కామిడి బిట్స్ గా ఉండేవి. కొత్తలో ఎగబడి చూసిన జనం తర్వాత కొంతకాలానికి అవి పాతబడిపోయిన భావం కలిగి బోర్ కొట్టసాగాయి. అప్పుడు మార్పు రావాల్సిన అవసరం ఉందని స్టూడియో అధినేతలు బుర్రల్లో సెర్చిలైట్స్ వేసుకుని వెతికారు.

ఇంతలోకి సినిమా మెల్లిగా బాల్యావస్దను వీడి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న గుర్తుగా మాటలు నేర్వడం,


రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్
మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/romantic-comedies/

అంతు ‘పట్టని’సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌


సినిమా:సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌
సంస్థ: ఆస్కార్‌ ఫిలిమ్స్‌
నటీనటులు: సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్‌ తదితరులు.
కెమెరా: రత్నవేలు
ఆర్ట్ : రాజీవన్
నిర్మాత: వి.రవిచంద్రన్‌



దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌
రిలీజ్ డేట్: 14 నవంబర్ 2008

ఒక జీవితాన్ని మొత్తాన్ని ఓ మూడు గంటలు సినిమాలో చూపెట్టడం కష్టమే. పోనీ ఎలాగోలా తిప్పలు పడి చూపించినా ఊహించని మలుపులు,ఎంటర్ టైన్ మెంట్ లేని ఆ సాదా సీదా జీవిత సారాన్ని భరించటం మరీ కష్టం. అదే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తేల్చి చెప్పిన సత్యం. అయితే గజనీ ఫేమ్ సూర్య డబుల్ రోల్ లో నటించటం,కాక కాక (ఘర్షణ) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందిచిన గౌతమ్ మీనన్ డైరక్టర్ కావటం,దశావతారం వంటి భారీ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన సినిమా కావంటం ఈ ఫిల్మ్ కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాయి. కానీ విపరీతమైన భావోద్వేగాలు స్లో నేరేషన్ తో నడిచే కథనం ఉన్న ఈ సినిమా చూడాలంటే టిక్కెట్టు రేటుతో పాటు గొప్ప ఓపిక కూడా ఉండాల్సిందే.


చయిత: జోస్యుల సూర్యప్రకాశ్

మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/surya-so-krishna/

’స్లమ్ డాగ్ మిలియనీర్’


మరో ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్తే జమాల్ మాలిక్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకుంటాడు. అతను ఇంత దూరం ఎలా రాగలిగాడు?

* 1) అతను మోసగాడు
* 2) అతను అదృష్టవంతుడు
* 3) అతను మేధావి
* 4) అది అతని తలరాత

’స్లమ్ డాగ్ మిలియనీర్’ అనే త్వరలో విడుదలవబోయే ఒక సినిమా పై ప్రశ్న తో మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

పరిచయం:గతంలో Trainspotting, Sunshine చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన Danny Boyle అనే బ్రిటిష్ దర్శకుడు పూర్తిగా ఇండియాలో నిర్మించిన ఒక ఆంగ్ల చిత్రం ’స్లమ్ డాగ్ మిలియనీర్’. వికాస్ స్వరూప్ రచించిన ‘Q and A’ అనే నవల అధారంగా Simon Beaufoy ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. త్వరలో (జనవరి, 2009) విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రేక్షకులూ మరియు విమర్శకుల మన్ననలు పొందడమే కాకుండా టొరాంటో చలనచిత్రోత్సవంలో ’పీపుల్స్ ఛాయిస్’ అవార్డు కూడా గెలుచుకుంది.

కథ: ఇది జమాల్ మాలిక్ అనే ఒక యువకుని కథ. ముంబాయిలోని ధారవి మురికివాడలో జన్మించి జీవితం ఆడించిన ఆటలో ఆచోటా ఈ చోటా తిరుగుతూ చివరికి ‘Who Wants to be a Millionaire?’ (కౌన్ బనేగా కరోడ్ పతి) అనే టెలివిజన్ షోలో పాల్గొని రెండుకోట్ల రూపాయలు గెలుచుకునే వరకూ
మిగిలినభాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/slumdog-millionaire-review/

Tuesday, November 11, 2008

నిశ్శబ్ద్ - పోస్టర్ మీద ‘అతనికి 60, ఆమెకు 18′


నిశ్శబ్ద్ - పోస్టర్ మీద ‘అతనికి 60, ఆమెకు 18′ అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది.

నిజంగా చెప్పాలంటే, ప్రేమకు వయసు, కారణం.. ఇలాంటివన్నీ ఉండవు. సినిమాల్లో అయితే మరీ గ్లోరిఫై అయిన ప్రేమ - మొదటి చూపు లోనే ప్రేమ - ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, చంపడం లేదా చచ్చిపోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాము గాబట్టి మనకవన్నీ అలవాటే. నిజ జీవితం లో ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన ఒక గృహస్థు (భార్యా, పిల్లలు కలవాడు) తన వయసులో కన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని ప్రేమించడం -

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/nisabdh/


రచన :సుజాత

Sunday, November 9, 2008

Katyn


’చరిత్ర ఎప్పుడూ విజేతల చేతే వ్రాయబడుతుంద’ని ఒక నానుడి. అందుకే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని వచ్చిన చిత్రాల్లో సామాన్యంగా ఎప్పుడూ హిట్లర్ అనుయాయులైన నాజీలనే దోషులుగా చూస్తాం. ఏమాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా చరిత్రని వక్రీకరించారని నింద వేస్తారు. ఎన్నో లక్షలమంది ప్రాణాలు బలిగొన్న రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్ర పేజీల్లోకి ఎక్కని నిజాలెన్నో. కేవలం విజేతల విజయగాధలు, నాజీల అకృత్యాలతో నిండిపోయిన ఈ చరిత్ర పుస్తకంలో మరుగున పడిపోయిన భయంకరమైన మూకుమ్మడి హత్యల్ని బయటపెట్టే ధైర్యం ఈరోజుకీ కూడా చాలామందికి లేదు. కానీ మొదటి నుండీ సినిమాని ఆయుధంగా వాడడంలో ఆరితేరిపోయిన ఆండ్రే వైదాకి మాత్రం ఆ సమస్య లేదు. 1940 katyn అడవిలో ఊచకోతకు గురైన ఇరవై వేలమంది పోలిష్ సైనికుల ఆత్మఘోషను కళ్ళముందు ఉంచడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. గత సంవత్సరం ఆస్కార్‍కి నామినేట్ అయిన ఈ పోలీష్ సినిమా Katyn మిగతా యుద్ధనేపధ్య సినిమాల కంటే భిన్నంగా ఉండడానికి ప్రధాణ కారణం ఈ సినిమాకి ఆండ్రే వైద్యా దర్శకుడు కావడమే(ఈయన గురించి నవతరంగంలో ఇప్పటికే ఒక అండ్రే వైదా" href="http://navatarangam.com/2008/11/andrzej-wajda/" target="_blank">పరిచయ వ్యాసం వచ్చింది).

మిగిలిన భాగం ఇక్కడ
http://navatarangam.com/2008/11/katyn-by-andrzej-wajda/

Oye Lucky Lucky Oye


Oye Lucky Lucky Oye త్వరలో విడుదల కానున్న ఒక బాలీవుడ్ సినిమా. ఈ సినిమా దర్శకుడు దిబాకర్ బెనర్జీ. ఈ దర్శకుడు గతంలో Khosla ka Ghosla అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అభయ్ డియోల్ (Manorama Six Feet Under) మరియు నీతూ చంద్ర (గోదావరి, ట్రాఫిక్ సిగ్నల్) తో పాటు పరేష్ రావల్ (ట్రిపుల్ యాక్షన్), అనుపమ్ ఖేర్, రణవీర్ షోరేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే అంతర్జాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే ఈ సినిమా సంగీతం కూడా.

ఈ సినిమా గురించి దిబాకర్ బెనర్జీ ఏమంటున్నారంటే...


మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/oye-lucky-lucky-oye/

బ్రీఫ్ ఎన్‌కౌంటర్


బ్రీఫ్ ఎన్‌కౌంటర్ అనే ఈ అద్భుతమయిన సినిమా కాన్సెప్టు 1945 లో వచ్చిందంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.
మామూలుగా పెళ్ళి అనేది ప్రేమ జీవితానికి ముగింపు. ఆ తరువాత ప్రేమ అంటే మన భాగస్వామితోనే. కానీ పెళ్ళి తరువాత మీ భాగస్వాములతో కాక వేరొకరితో ప్రేమలో పడితే ??

ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమయిన సినిమా “బ్రీఫ్ ఎన్‌కౌంటర్”.

లారా అనే ఒక మామూలు గృహిణి ఎంతో ఆనందమయిన జీవితం గడుపుతుంటుంది. మంచి భర్త, ఇద్దరు పిల్లలు.

ప్రతీ గురువారం “మిల్ఫర్డు”కి వెళ్ళి షాపింగు చేసి సినిమాలు చూడడం అలవాటు.

అలాంటి ఆమెకి ఒకరోజు అక్కడి రిఫ్రెష్‌మెంటు రూములో అలెక్ అనే ఒక డాక్టరు అనుకోకుండా పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకరి పట్ల ఇంకొకరు ఆకర్షితులవుతారు.


మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/brief-encounter/

Friday, November 7, 2008

సీతారామయ్య గారి మనవరాలు


సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో. ఇప్పుడు ఉన్నట్టుగా పల్లెటూళ్ళలో కూడా టెలిఫోన్ లు, ప్రతి మూడో మనిషి దగ్గర మొబైల్ ఫోన్లు పదిహేడేళ్ళ క్రితం ఉండి ఉంటే మనమంతా ”సీతారామయ్య గారి మనవరాలు’ అనే ‘తెలుగు’ సినిమాను మిస్ అయ్యేవాళ్ళం కదా! ఆర్ద్రత నిండిన కథ, కథనం, పాత్రోచిత నటన, కథనానికి ప్రాణం పోసే సంగీతం ఈ సినిమా ని క్లాసిక్ గా మార్చాయి. నా స్నేహితుల్లో కొందరు దీనిని ‘చివరి తెలుగు సినిమా’ అని అంటుంటారు. కథగా చెప్పాలంటే ఇది మూడు లైన్ల కథ. ఇచ్చిన మాటకీ ప్రాణం ఇచ్చే తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయలేని కొడుక్కి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్. ఫలితంగా ఆ కొడుకు కుటుంబానికి దూరం అవడం తిరిగి తన కూతురి ద్వారా కుటుంబాన్ని కలుసుకోవాలనుకోవడం. క్రాంతి కుమార్ దర్శకత్వం, కీరవాణి సంగీతం, నాగేశ్వర రావు , రోహిణి హట్టంగడి, మీనా ల నటన ఈ సాధారణ కథ ఓ అసాధారణ సినిమా గా రూపు దిద్దుకోడానికి తోడ్పడ్డాయి.

‘మానస’ రాసిన ‘నవ్వినా కన్నీళ్ళే’ నవల ఆధారంగా (ఈ నవల ఎక్కడ దొరుకుతుందో ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు)

మిగిలిన భాగం ఇక్కడ

రచన:మురళి
http://navatarangam.com/2008/11/seetaramaiahgari-manavaralu/

Thursday, November 6, 2008

రెండు లఘు చిత్రాలు


నవతరంగం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి జొనాథన్ గురించి తెలిసేవుంటుంది. ఆయన నిర్మించిన రెండు లఘు చిత్రాలు చూడమని ఇక్కడ(నవతరంగంలో) చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న జొనాథన్ రూపొందించిన ఈ రెండు సినిమాలూ అద్భుతం అని చెప్పలేము కానీ ఈ మధ్యలో వస్తున్న చాలా లఘు చిత్రాలకంటే ఎన్నో రెట్లు బావుండడమే కాకుండా మరి కాస్త శ్రద్ధ తో తీస్తే మంచి దర్శకుడిగా పేరు సాధిస్తాడని నమ్మకం ఉంది. ఆ రెండు సినిమాలనూ నవతరంగం పాఠకులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం. వాటిని చూసి మీ విమర్శలూ వ్యాఖ్యలూ అతనికి తెలియచేయమని ప్రార్థన.
రచన : వెంకట్
మిగిలిన భాగం ఇక్కడ
http://navatarangam.com/2008/11/2-short-films/

ఆండ్రే వైదా-ఒక పరిచయం


పరిచయం:

అయనకి సినిమా ఒక ఆయుధం. ఆయనకి సినిమా ఒక సాధనం. ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్ శీర్షికలో దృష్టి సారిస్తున్న సందర్భంగా ఆయన సినిమాల జీవిత విశేషాలతో కూడుకున్న పరిచయవ్యాసం ఇది.

డబ్లిన్ పట్టణం మొత్తం నాశనమైపోయినా “తన నవలల్లోని సమాచారం ద్వారా తిరిగి అలాగే నిర్మించొచ్చు” అని James Joyce అన్నదాంట్లో ఎంత నిజముందో తెలియదుకానీ వైదా సినిమాల ద్వారా పోలండ్ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలకు దృశ్యరూపమిచ్చి ఆ దేశ చరిత్రను తన సినిమాల ద్వారా పునర్నిర్మించారని ఆయన సినిమాలు చూసిన ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. సినిమాలు కేవలం వినోదం కోసమే కాదని వాటి ద్వారా ఎంతో సాధించవచ్చని నమ్మినవారిలో ముఖ్యుడు వైదా. మార్చి 6, 1926 న పోలండ్ లోని సువాల్కి లో జన్మించిన ఆండ్రే వైదా (Andrzej Wajda) ప్రపంచంలోని అత్యుత్తమ సినిమా దర్శకుల్లో ఒకరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


రచన : శిద్దారెడ్డి వెంకట్

మిగిలిన భాగం ఇక్కడ

http://navatarangam.com/2008/11/andrzej-wajda/



Wednesday, November 5, 2008

‘మనసు’మంగళి - ఇక నా ముగింపు


సినిమా మెలో డ్రామానా లేక ఇంకోటా అనే విషయాన్ని ప్రక్కన పెడితే, మనం తప్పక అర్ధం చేసుకోవలసిన పాయింట్ ఈ సినిమాలో ఉంది. అదే మనిషి జీవితం లో విలువలు. వాటి ప్రాధాన్యం.

అలాగే మరో పాయింట్ ‘మాన్/హీరో వర్షిప్’. ప్రేమ అంటే ఏంటనే దానికి చాలా అర్ధం ఈ సినిమాలో వెతుక్కోవచ్చు.

నాకు దర్శకుడెవరో తెలీదు. ఎందుకంటే ఆ సినిమా చూసి పదిహేనేళ్ళు అయింది. సంగీతం కూడా నిన్నటి దాకా నాకు తెలీదు. ‘సాక్షి’ దిన పత్రిక లో ఇచ్చే పాట క్రింద చూశాను.

నటీనటులు నాకు తెలిసి గుర్తుంది అక్కినేని, సావిత్రి, రేలంగి, (గుమ్మడున్నాడో లేడో, జగ్గయ్య ఉన్నట్టు గుర్తు. సావిత్రికి అతనితోనే పెళ్లి చేయాలనుకుంటాడు నాగేశ్వరరావు)

కానీ కమ్మని పాటలున్నాయి.


రచన: గీతాచార్య

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/sumangali/

శుభ సంకల్పం (1995)


నేను ఎట్టకేలకి “శుభసంకల్పం” సినిమా చూసాను. సినిమా రిలీజైంది 1995 లో. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. చూసినట్లు గుర్తు ఉంది కానీ, సినిమా పూర్తిగా గుర్తు లేదు. ఇప్పుడు చూశాక సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది, ఈ సినిమాని గురించి నేను చెప్పాలనుకున్నవి చాలా ఉండటంతో. :) మొదట కథ క్లుప్తంగా - రాయుడు గారి నమ్మిన బంటు దాసు. రాయుడి మనవరాలు సంధ్య. దాసు, గంగల ప్రేమ తెలుసుకున్న రాయుడు వాళ్ళకి వివాహం జరిపిస్తాడు. దాసు రాయుడి డబ్బుని తన ఇంట్లో పెట్టి దాస్తాడు. దాన్ని కాపాడే ప్రయత్నంలో దాసు బామ్మ, గంగా ఇద్దరూ మరణిస్తారు. దాసు పసిబిడ్డతో మిగుల్తాడు. ఆ బిడ్డని తీసుకుని సంధ్య అమెరికా వెళ్ళిపోతుంది. దాసు ఇక్కడ రాయుడి వారసత్వాన్ని స్వీకరించి “రాయుడు సీ ఫుడ్స్” యజమాని ఔతాడు. నేను కథని ఇలా చెప్పినందుకు నన్ను నానా తిట్లూ తిట్టేవాళ్ళు చాలామంది ఉంటే ఉండవచ్చు గానీ,

రచన:సౌమ్య
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/subha-sankalpam/

సినీ అధ్బుతం ‘బి.ఆర్ చోప్రా’ మృతి


భారత సినీ పరిశ్రమ గర్వించతగ్గ ప్రముఖులలో ఒకరైన బి.ఆర్ చోప్రా(94) ఈ ఉదయం 8.15 నిముషాలకు ముంబయి, జుహు లోని తన స్వగృహంలో మరణించారు. గత కొంత కాలంగా అస్వస్ధతకుతో బెడ్ రెస్ట్ లో ఉన్న ఈ సిని కురు వృధ్ధుడు మరణానికి బాలీవుడ్ మొత్తం నీరాజనాలు అర్పిస్తోంది. ఆయన తన బి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై కెరీర్ లో క్లాసిక్ లుగా పరిగణించతగ్గ నయా దౌర్,ఏక్ హి రిస్తా,కానూన్,ధూల్ క ఫూల్,గుమ్రాహ్ వంటి చిత్రాలును రూపొందించారు.

కుటుంబ విలువలు,సామాజిక అంశాలుతో సినిమాలు నిర్మించటమన్నా,దర్శకత్వం వహించమన్నా ఆసక్తి చూపేవారు.అలాగే 1985 లో తన బ్యానర్ పై మహాభారత్ టీవీ సీరియల్ నిర్మించి సంచలనం సృష్టించారు. ఇక ఈయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ 1998లో భారత ప్రభుత్వం దాదా ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ సాయింత్రం జుహు స్మసానవాటికలో 4.30 కు దహన సంస్కారాలు ఏర్పాటు చేస్తున్నారు.



రచన; సూర్య ప్రకాష్

మిగిలిన భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/11/b-r-chopra/

బి.ఆర్ చోప్రా గురించి….

Sunday, November 2, 2008

లండన్ చలనచిత్రోత్సవ విజేతలు


The Sutherland Trophy Winner: TULPAN directed by Sergey Dvortsevoy.

The Sutherland Trophy is awarded to the director of the most original and imaginative first feature film screened at The Times BFI London Film Festival.

In awarding the trophy, the Sutherland Jury said of the film: “A masterpiece: both intimate and epic, a film full of life and ideas. An extraordinary feat of artistic endeavour in its depiction of man’s interaction with nature, TULPAN has an exhilarating blend of humour, emotion, and audacious visuals.”

Previous winners: PERSEPOLIS 2007, RED ROAD 2006, FOR THE LIVING AND THE DEAD 2005, TARNATION 2004, OSAMA 2003, CARNAGES 2002, THE WARRIOR 2001 and YOU CAN COUNT ON ME 2000, RATCATCHER 1999, THE APPLE 1998.


రచన:వెంకట్
మిగిలిభాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/10/52nd-london-film-festival-award-winners/

లండన్ చలనచిత్రోత్సవం - రిపోర్టు - 6


31)The Candidate

డెన్మార్క్ సినిమా. చాలా బావుందీ సినిమా.

సినిమాలో హీరో ఒక లాయర్. అతని తండ్రి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఏడాది క్రితం తన తండ్రి ఒక కేసులో ఓడిపోయి ఇంటికెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. కానీ అది యాక్సిడెంట్ కాదనీ మర్డర్ అనీ అతని నమ్మకం. అది ఎలా నిరూపించాలో తెలియక అటు తన వృత్తి లోనూ ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాడు. ఒక సాయంత్రం తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ జరుగుతుంది. కోపంగా ఇంట్లోనుంచి బయటకు వచ్చి తన మిత్రునితో కలిసి ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయి పరిచయం అవుతుంది. అతనికి అంత వరకే గుర్తుంటుంది. ఆ తర్వాత ఉదయం ఒక హోటల్లో నిద్రలేచి చూసేసరికి బాత్ రూమ్ లో ఆ అమ్మాయి శవం వుంటుంది. అసలేం జరిగిందో అతనికి గుర్తుండదు.

రచన:వెంకట్
మిగిలిభాగం ఇక్కడ http://navatarangam.com/2008/11/london-film-festival-report-6/

మనము సినిమాలెందుకు చూస్తాం?


ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము?

టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే, పరోక్షంగా సంతృప్తి పొనదటానికి అన్నది మానసిక శాస్త్రి సమాధానం.ఇలా సినిమాలెందుకు చూస్తాము అన్నదానికి రకరకాల సమాధానాలొస్తాయి. అసలు సినిమాలెందుకు చూడాలి? అని మనల్ని మనము ప్రశ్నించుకుని లోతుగా విశ్లేషించుకుంటే, సినిమాలెందుకు చూడాలో మాత్రమే కాదు, సినిమాల ప్రాధాన్యం, మనపైన అవి చూపే ప్రభావం, సినీ కళాకారుల బాధ్యత వంటి విషయాలు కూడా మనకు అర్ధమవుతాయి.





రచన:కస్తూరి మురళీ కృష్ణ
మిగిలిభాగం


ఇక్కడ

చదవండి

సిటిజెన్ కేన్ -సినిమా పరిచయం


1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు తెరవెనక పడ్డ పాట్లు మరో మహాకావ్యాన్ని తలపిస్తాయి. ఆ వివరాలు, ఈ వ్యాసంలో.

సినిమా పరిచయం

రచన:అబ్రకదబ్ర
మిగిలిభాగం ఇక్కడ

ఫ్యాషన్ సినీ సమీక్ష


ఇంతకు ముందే నేను ఫ్యాషన్ సినిమా చూశాను. దాని కోసం మా కజిన్ ని తీసుకెళ్ళాను. నాకేమన్నా పిచ్చి ఎక్కితే తిన్నగా ఇంటికి తీసుకెళ్తాడని. ఐతే ఆ అవసరం రాలేదు. నిజం గా మాథుర్ భండార్కర్ మాథుర్ భండార్కరే!

ఎంతో కాలంగా ఆ సినిమా గురించి వింటున్నాను. అతని గురించి కూడా వింటూనే ఉన్నాను. ‘చాందినీ బార్’, ‘ట్రాఫిక్’, ‘పేజ్ -౩’ మొదలైన సినిమాలతో ఖ్యాతి గడించిన అతను ఈ సారి Fashion world మీద దృష్టి పెట్టాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండీ మా ఫ్రెండ్స్ అంతా లొట్టలేసుకుంటూ ఎదురు చూడ సాగారు. దాంతో నాకు ఆ సినిమా మీద ఒక వేరే అభిప్రాయం మొదలైంది.

ఎట్టకేలకు ఆ సినిమా రానే వచ్చింది. ఏదేమైనా సరే! చూసేద్దాం. ఐతే విజువల్ ఫీస్ట్, లేక పోతే మంచి సినిమా చూసిన అనుభవం దక్కుతుందని, మా ఫెండ్స్ కి చెప్పకుండా మా వాడితో వెళ్ళాను. వెళ్ళెటప్పటికే సినిమా మొదలైంది. ప్రియాంకా చోప్రా తెర మీద ఉంది. మా వాడి కళ్ళూ వెలిగాయి అనుకుంటా. చీకట్లొ కనపడలేదు. నాకు మాత్రం వెలిగినట్టు అనిపించింది. సుత్తిసరె!
రచన:గీతాచార్య
మిగిలిభాగం ఇక్కడ

పథేర్ పాంచాలి సినిమా పరిచయం

(”పథేర్ పాంచాలి”, “అపరాజితో”, “అపు సంసార్” పేర్లతో అదే వరసలో బెంగాలీలో “అపు చిత్రత్రయం” గా తీసిన సత్యజిత్ రాయ్ సినిమాలలో మొదటి సినిమా “పథేర్ పాంచాలి” ని ఇక్కడ పరిచయం చేస్తున్నా. ఈ మూడు సినిమాలకి మూలం, బెంగాలీలో వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల.)

దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమాతోనే ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న “పథేర్ పాంచాలి” సినిమాతో, దర్శకుడిగా సినిమారంగేట్రం చేసాడు రాయ్. 1955 సంవత్సరంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిర్మాతగా నిర్మించిన చిత్రం ఇది. ఈ వ్యాసం చివర ఇచ్చిన ప్రశంసల జాబితా వల్ల, మొదటి సినిమాతో ప్రపంచంలో సంచలనం రేపిన అరుదైన సినిమా దర్శకుల జాబితాలో రాయ్ పేరు చోటు చేసుకుంది.

ఏమిటి ఈ సినిమా గొప్పతనం?

రెండు మాటల్లో చెప్పాలంటే, “కళా ప్రదర్శన”. అంటే, సినిమా అన్న మాధ్యమం ఉపయోగిస్తూ అత్యంత కళాత్మకంగా తీసిన మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమాని పేర్కొనవచ్చు. అప్పటి వరకు, భారతీయ గ్రామీణ జీవితాన్ని కాని, లేదా పట్టణ జీవితాన్ని కాని సంగ్రహంగా చూపించే సినిమాలు బహుశా రాలేదని అనుకోవాలి! అసలు ఈ సినిమా కథను ఎంచుకోటంలోనే రాయ్ గొప్పతనం కనపడుతుంది. ఈ సినిమా కథను, ఒక కథగా చూస్తే, అతి చప్పగా, అద్భుతంగా ఉండే ఎటువంటి సంఘటనా లేనటువంటి కథ ఇది.
రచన :విష్ణుభొట్ల లక్ష్మన్న
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
ఇక్కడ