Friday, October 17, 2008

నవతరంగం రచనలకు ఆహ్వానం







తెలుగు సినిమా ప్రపంచస్థాయి ఖ్యాతిదక్కించుకోవాలంటే మన మాతృ భాషలో మంచి సినిమాలు
వెలువడటంతోపాటు పలు భాషలలో వస్తున్న నవీన పద్ధతులను కూడా ఆకళింపు చేసుకోవలసిన ఆవశ్యకత వుంది. తెలుగు సినిమా సమీక్షలే కాకుండా భారతదేశంలోని వివిధ భాషల సినిమాల
సమీక్షలు, విశ్లేషణా వ్యాసాలు ఈ సైటులో ప్రముఖంగా కనిపిస్తాయి. ఒక్క
భారతదేశపు సినిమాలే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాలనూ పరిచయం
చేసే ఒకే ఒక్క తెలుగు సైటు మా నవతరగం http://navatarangam.com/
సినిమా సమీక్షలు, పరిచయాలే కాకుండ ప్రతీనెలా ఒక్కొక్క ప్రముఖ దర్శకుణ్ణి
పరిచయం చేస్తూ 'ఫోకస్' అనే శీర్షిక నడుపుతున్నాం. ఈ శీర్షికన ఇప్పటివరకూ
బి.యన్.రెడ్డి, ఎల్వీ ప్రసాద్, రిత్విక్ ఘటక్, జాన్ అబ్రహం, అకిరా
కురొసావా, కెంజి మిజొగుచి, బాపు, తపన్ సిన్హా, సత్యజిత్ రే, బెల టర్
లాంటి దర్శకుల సినిమా సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు
ప్రచురింపబడ్డాయి.ఈక్రమంలో తాజాగా ‘లక్షహిట్ల’ మైలురాయిని కేవలంపదినెలల కాలంలో విజయవంతంగా అధిగమించింది.ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్యనే ప్రపంచ సినీ ఉద్యమాలు అనే శీర్షిక మొదలుపెట్టి చలనచిత్ర పరిశ్రమ గతిమార్చిన సినీ ఉద్యమాలను, ఆ ఉద్యమ
ఫలితాలైన సినిమాలనూ పరిచయం చేయడం మొదలుపెట్టి జర్మన్ భావవ్యక్తీకరణ వాదం
గురించి ప్రస్తుతం వ్యాసాలు ప్రచురిస్తున్నాము.
వీటితో పాటు ఎప్పటికప్పుడు ఫిల్మ్ మేకింగ్ లోని మెలుకవలు తెలిపే
వ్యాసాలు, ప్రపంచ చలన చిత్రోత్సవాల గురించి రిపోర్టులు, అందరూ చూడదగ్గ
లఘు చిత్రాలు, సినీ ప్రపంచంలోని వార్తలు విశేషాలతో పాటు ప్రముఖుల
పరిచయాలు, వారితో ఇంటర్వ్యూలు కూడా నవతరంగంలో చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటికి 40 సభ్యులు నవతరంగంలో చేరి తమ వ్యాసాలను రెగ్యులర్ గా
ప్రచురిస్తున్నారు. వీరిలో చాలామంది ప్రముఖ తెలుగు బ్లాగర్లు కూడా
ఉన్నారు.
మంచి సినిమాలను ప్రోత్సా హించే సహృదయులైన పాఠకులనుండి నవతరంగం రచనలను ఆహ్వనిస్తుంది. తెలుగు యూనికోడ్ ఫాంట్లలో వెలువడుతున్న ఏకైక తెలుగువెబ్ సైటు నవతరంగానికి మీరచనలు అందజేయటం ఎంతో సులభం.తక్కిన వివరాలకోసం సందర్శించండి http://navatarangam.com/

No comments: