Wednesday, October 29, 2008

W.


ప్రపంచంలో చాలా మంది బుద్ధిమంతులకి జార్జ్ బుష్ అంటే మంట. అందులో నేనూ ఒకణ్ణి. బుష్ ద్వేషుల్లో ముందు వరసలో వుండే వాళ్ళల్లో ముందుండేవాడు ఆలివర్ స్టోన్. ఆయన గురించి తెలియని వాళ్ళకి, ఆలివర్ స్టోన్ లిబరల్ / వామపక్ష రాజకీయ వాది. అమెరికా రాజకీయ పరిభాషలో దానర్ధం డెమెక్రటిక్ పార్టీ సానుభూతిపరుడు / కార్యకర్త అని. ప్రతి ఎన్నికలలోనూ డెమెక్రటిక్ అభర్ధులకి భారీగా విరాళాలు యిచ్చిన వాడు. యుద్ధ వ్యతిరేకి. అలాంటి వాడు బుష్ మీద సినిమా తీస్తున్నాడంటే, అదీ ఎన్నికల ముందు విడుదల అయ్యేలా ప్లాన్ చేసి తీస్తున్నాడంటే క్రిందటి ఎన్నికల ముందు రిలీజ్ అయిన మైకల్ మోర్ సినిమాలాగా బుష్ మీద సెటైర్ లు వుంటాయనీ వాటిని చూసి ఆనందిద్దామని వెళ్ళాను. కానీ యిది మైకల్ మోర్ సినిమాలాంటిది కాదు. గొప్ప తెలివి తేటలో, చదువో, ఉద్యమ నేపథ్యమో, వ్యాపారంలో నౌపుణ్యమో ఏమీ లేని ఒక మనిషి, మప్ఫై సంవత్సరాలు పైగా రికామీగా తాగుతూ తిరిగి, ఎందులోను విజయవంతం అవని ఒక గొప్పింటి అబ్బాయి, ప్రెసిడెంట్ కొడుకూ, ఎలా యింత పెద్ద స్థాయికి ఎదిగి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడిగా అయ్యాడో, అతన్ని నడిపించిన శక్తులు ఎలాంటివో పరిశీలించడం స్టోన్ లక్ష్యంగా కనపిస్తుంది. ఆ పని ఆయన బుష్ పట్ల సానుభూతిపూర్వకంగానే చేసాడనే అనిపించింది.

జాష్ బ్రోలిన్ జార్జ్ బుష్ గా నటించిన ఈ సినిమాలో ప్రధానంగా మూడు అంకాలు వున్నాయి, ఎందులోను విజయవంతం కానీ బుష్ ...

రచన -రమణ
మిగిలిభాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/10/w/

No comments: