Sunday, October 26, 2008

లండన్ చలనచిత్రోత్సవం - రిపోర్టు




నవతరంగం పాఠకులకు నమస్కారం.

ఈ నెల పదిహేనవ తేదీ నుంచి లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురించి మీకు తెలిసే వుంటుంది. ఈ చిత్రోత్సవంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన 300 సినిమాలను ప్రదర్శిస్తున్నారు.పది పదిహేను రోజుల్లో అన్నీ సినిమాలు చూడడం కుదరకపోయినా కనీసం ఒక యాభై సినిమాలైనా చూడాలనే లక్ష్యం పెట్టుకుని నేనూ ఈ పండగ లో భాగం అయ్యాను.ఈ రోజు ఈ చిత్రోత్సవంలో ఆరవ రోజు. ఇప్పటి వరకూ ఈ చిత్రోత్సవం లో నేను చూసిన సినిమాల గురించి తెలియచేసే మొదటి రిపోర్టు ఇది.ఈ చలనచిత్రోత్సవంలో నేను చూసిన సినిమాల వివరాలు.

Note:ఈ సినిమాల గురించి పూర్తి స్థాయి సమీక్షలు ఇక్కడ పొందు పరచడం లేదు. చలనచిత్రోత్సవం తర్వాత, అన్నీ కాకపోయినా కొన్ని ముఖ్యమైన సినిమాల గురించి పూర్తి స్థాయి సమీక్షలు వ్రాసే ప్రయత్నం చేస్తాను.

1)Once Upon a Time in the West

ఈ చలనచిత్రోత్సవం లో నేను మొదటిగా చూసిన సినిమా Once Upon a Time in the West. Sergio Leone అనే ఇటాలియన్ దర్శకుడు రూపొందించిన వెస్టర్న్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా మందికి తెలిసే వుంటుంది. నటీ నటుల నటన, సంగీతం, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాకి హైలైట్స్. మళ్ళీ మళ్ళీ చూసి ఆనందిచగలిగే సినిమా. ఈ సినిమాని ఈ చలన చిత్రోత్సవం సందర్భంగా డిజిటల్ గా restore చేసి చాలా ఏండ్ల తర్వాత వెండి తెరపై ప్రదర్శించారు. చాలా సార్లు చూసిన సినిమా అయినప్పటికీ వెండి తెరపై చూసిన అనుభూతి చాలా బావుంది.

2)Kala


రచన :వెంకట్

http://navatarangam.com/2008/10/52nd-london-film-festival-report-1/

రెండో భాగం

http://navatarangam.com/2008/10/london-film-festival-report-2/

No comments: