Thursday, October 23, 2008

చదివారా,తగలెయ్యండి...





Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు.
కధలోకి వస్తే CIA ఎనాలసిస్ట్ గా పనిచేసే Cox(John Malkovich)ని తాగుబోతు ముద్రవేసి వేరే సెక్షన్లోకి ట్రాన్స్ఫర్ చేసే తంతుతో మొదలవుతుంది.

Cox మాత్రం అసలు కారణం చెప్పకుండా తనను తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారని ఫీలైపొయి ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. తన CIA అనుభవాలతో ఒక memoir రాద్దామని నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు Cox భార్య Katie(Tilda Swinton) Harry(George cloony) అనే ట్రెజరీ ఏజెంట్‌తో ప్రేమాయణం సాగిస్తూ ఉంటుంది.

Cox నుండి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న Katie లాయర్ ఆజ్ఞ ప్రకారం Cox లేని సమయం చూసి అతని కంప్యూటర్‌లోని పర్సనల్ డేటా అంతా ఒక CDలోకి కాపీ చేసిస్తుంది. ఆ లాయర్‌గారి సెక్రటెరీ ఆ CDని ఒక gym lockerలో పెట్టి మర్చిపోతుంది. అంతకుముందే హార్డ్ డ్రైవ్ మీద ఒక కాపీ ఉందడంతో మరో కాపీ రెడీ చేసి సమస్య తీరిపోయిందనుకుంటుంది. కానీ....

రచన :శంకర్

http://navatarangam.com/2008/10/burn-after-reading-forget-after-watching/

No comments: